Black Lips: సిగరెట్ వల్ల మీ పెదాలు నల్లగా మారాయా?..ఈ సమస్యలు తప్పవు

ధూమపానం చేసే వారికి నల్లటి పెదాలు ఉంటాయి. నల్లటి పెదాలకు సిగరేట్‌తో పాటు అనేక కారణాలు కూడా ఉన్నాయి. విటమిన్ బి12 లోపం వల్ల పెదాలు నల్లగా మారుతాయి. ఇలాంటి పెదవులను సంరక్షించుకోవడానికి మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ వాడవచ్చు. శరీరానికి తగినంత నీరు తాగడం ముఖ్యం.

New Update
Black Lips: సిగరెట్ వల్ల మీ పెదాలు నల్లగా మారాయా?..ఈ సమస్యలు తప్పవు

Black Lips: అందమైన చిరునవ్వు ఇచ్చే పెదాలను ఎంతో అందంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. దంతాలు, పెదవుల మధ్య చిరునవ్వును ప్రతిఒక్కరిని ప్రభావితం చేస్తాయి. అయితే కొందరిలో నల్లటి పెదవుల గురించి కొన్ని అపోహలు ఉంటాయి. ధూమపానం చేసే వారికి మాత్రమే నల్లటి పెదాలు ఉంటాయనుంటారు. అది అలా కాదు..పెదవి పిగ్మెంటేషన్‌కు అనేక ఇతర కారణాల వలన ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. కొందరిలో సిగరెట్ తాగకపోయినా..పెదవులు నల్లగా మారుతూ ఉంటాయి. అప్పుడు ఈ సమస్యలు రావచ్చు అంటున్నారు. అయితే.. చర్మం, వెంట్రుకల మాదిరిగానే పెదవులకు కూడా కొంత శ్రద్ధ ముఖ్యం. పెదవుల చర్మం శరీరం చర్మం కంటే సన్నగా ఉంటుంది. అందువలన అవి త్వరగా ఎండటం, పగుళ్లు వస్తాయి. అయితే పెదవుల నల్లబడటానికి ఇది మాత్రమే కారణం కాదు. పెదవులపై నల్లటి మచ్చలు రావడానికి గల కారణాలు, వాటిని తొలగించే మార్గాల గురించి ఇప్పుడు కొని విషయాలు తెలుసుకుందాం.

పెదవులపై నల్ల మచ్చలకు కారణాలు:

  • కొన్నిసార్లు కొత్త బ్యూటీ వస్తువులు రాస్తే అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. అందువలన కూడా పెదవులపై నల్ల మచ్చలు వస్తాయి. ఈ సమస్యని అలెర్జీ కాంటాక్ట్ చీలిటిస్, పిగ్మెంటెడ్ కాంటాక్ట్ చీలిటిస్ అంటారు. టూత్‌పేస్ట్, మౌత్‌వాష్, హెయిర్ డై, సువాసన, లిప్‌స్టిక్, లిప్ బామ్, ఫ్లేవర్, గ్రీన్ టీలో ఉండే నికెల్ వల్ల ఈ సమస్యలు వస్తాయి.
  • శరీరం ఎక్కువ ఐరన్‌ను నిల్వ ఉంటే చర్మంపై నల్లటి మచ్చలు, అలసట, కాలేయ సమస్యలు, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పెదాలు నల్లగా కనిపిస్తే.. వాటిని ఒకసారి చెక్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
  • ఇది సూర్యరశ్మి, UV కిరణాల వల్ల కలిగే నష్టం వల్ల ఆక్టినిక్ కెరాటోసిస్ వస్తుంది. దీనికి వృత్తిపరమైన సంరక్షణతోపాటు, చర్మవ్యాధి నిపుణులను సంప్రదిస్తే మంచిదంటున్నారు.
  • విటమిన్ బి12 లోపం వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. ఇది రక్తహీనత, నోటి పూతల, చిరాకు, ఎరుపు నాలుక, గొంతు నొప్పి, లేత చర్మం వంటి ఇతర లక్షణాలను సూచించవచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ సలహాపై మల్టీవిటమిన్లను తీసుకుంటే మంచిది.
  • పెదవులపై నల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే హానికరమైన UV కిరణాల నుంచి రక్షించడానికి SPFతో లిప్ బామ్‌, నీరు త్రాగండి, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్, క్రీమ్ అప్లై చేయాలి.క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. నియాసినామైడ్, విటమిన్ సి, కోజిక్ యాసిడ్, లైకోరైస్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి పదార్థాలు,  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలంటున్నారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో కర్పూర దీపం వెలిగిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు