Health Tips: ఉదయం మాటిమాటికి అలారం ఆపేస్తున్నారా ? జరిగేది ఇదే..

చాలామంది రాత్రిపూట పడుకునేముందు తెల్లవారుజామునే లేవాలని అలారం పెట్టుకుని పడుకుంటారు. కానీ ఉదయం అలారం మోగగానే మాటిమాటికి దాన్ని ఆపేస్తూ మళ్లీ మళ్లీ పడుకుంటారు. అయితే ఇలా చేయడం కూడా మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు.

New Update
Health Tips: ఉదయం మాటిమాటికి అలారం ఆపేస్తున్నారా ? జరిగేది ఇదే..

సాధారణంగా పొద్దున్నే నిద్రలేవాలని అనుకునేవారు రాత్రి పడుకునేముందు అలారం పెట్టుకుంటారు.కొంతమంది తెల్లవారుజామున అలారం మోగగానే అప్పుడే లేస్తుంటారు. కానీ చాలామందికి మాత్రం తెల్లవారుజామున అలారం మోగినప్పుడు లేవాలనిపించదు. కళ్లు మూతలు పడుతుంటాయి. అబ్బా ఇప్పుడు లేవాలా అంటూ బద్ధకంగా అనిపించడంతో అలారం ఆపేసి మళ్లీ పడుకుంటారు. ఆ తర్వాత మళ్లీ 5 లేదా 10 నిమిషాలకు మళ్లీ అలారం మోగుతుంది. అప్పుడు కూడా అలారం కట్టేసి తిరిగి పడుకుంటారు. అలా కాసేపు నిద్ర, కాసేపు మెలుకువతో నానాతంటాలు పడి.. చివరికి ఏ పావుగంటకో అరగంటకో తప్పని పరిస్థితుల్లో లేచి బెడ్‌పై నుంచి దిగుతారు. చాలామందికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

అయితే వాస్తవానికి పెందలాడే నిద్రలేవడం చాలా మంచి అలవాటు. కానీ అన్నిసార్లు అలా లేవడం కుదరకపోవచ్చు. ముఖ్యంగా రాత్రికి ఆలస్యంగా పడుకునేవారికి ఇదో పెద్ద టాస్క్ లాంటిదే. ఒకవేళ లేచిన కూడా నిద్రమత్తులోనే సతమతవుతూ ఉంటారు. ఆ తర్వాత అలారం మోగినప్పుడు నిద్ర లేవలేకపోయామని తమను తాము తిట్టుకుంటారు కూడా. అయితే దీనిపై తాజాగా అధ్యయనం చేసిన స్వీడన్ పలు కీలక విషయాలు చెప్పింది. తెల్లవారుజామున మెలుకవ వచ్చాక వెంటనే కాకుండా కునుకు తీసినట్టు కొద్దిసేపు పడుకొని లేవడం కూడా మంచిదేనని వెల్లడించింది. ఇలా చేయడం వల్ల చురుకుగా, స్పష్టంగా ఆలోచించడానికి తోడ్పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా రాత్రికి ఆలస్యంగా నిద్రపోయేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం అలారాన్ని ఆపేసే అలవాటు చిన్నవయసువారిలో, అలాగే ఆలస్యంగా నిద్రపోయేవారిలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీళ్లలో చాలామంది ఉదయం నిద్రలేచినప్పుడు కనీసం గంట పాటు నిద్రమత్తులోనే ఉంటారని.. కాసేపు అలాగే పడుకొని లేస్తే హుషారుగా ఉంటున్నారని పరిశోధకులు వివరించారు.

Also Read: రాత్రి నిద్రపట్టడం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..కుంభకర్ణుడు కూడా మీ తర్వాతే..!!

ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా పడుకునేవారికిది బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. సాధారణంగా ఉదయం అలారాన్ని కట్టేసే అలవాటు చిన్నవయసువారిలో, ఆలస్యంగా నిద్రించేవారిలో ఎక్కువ. వీరిలో చాలామంది లేచాక కనీసం గంట సేపైనా నిద్రమత్తుతో జోగుతుంటారు. కాసేపు అలాగే పడుకొని, లేస్తే హుషారుగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మళ్లీ మళ్లీ అలారం మోగడం వల్ల నిద్ర నాణ్యత తగ్గినప్పటికీ కార్టిజోల్ హర్మోన్ మోతాదులు, మూడ్‌ మీద పెద్దగా ప్రభావం చూపించవని.. ఆలోచన సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.

మరో విషయం ఏంటంటే అలారాన్ని మాటిమాటికి ఆపేస్తూ ఎక్కువ సేపు పడుకుంటే ఇది కూడా ప్రమాదమే అని చెబుతున్నారు. ఏదో అరగంట సేపు వరకు ఇలా చేయచ్చుగాని.. ఎక్కువ సేపు అలాగే నిద్రలేస్తూ పడుకుంటూ ఉంటే లాభాల కంటే నష్టాలే ఉంటాయని గుర్తించారు. ఇలా మాటిమాటికి అలారం ఆపేస్తూ ఎక్కువసేపు పడుకుంటే నిద్రకు భంగం కలిగినట్లు శరీరం భావిస్తుందని.. దీనివల్ల ఇది అనర్థాలకు దారి తీస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

Also read: కోపమెక్కువా…అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే..

Advertisment
Advertisment
తాజా కథనాలు