Ginger Water: అల్లం వేడినీటిలో కలిపి తాగుతున్నారా..? జాగ్రత్తలు తెలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మాయదారి మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలందరూ నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కరోనా నుంచి బయటపడాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని డాక్టర్లు చూచించారు. By Vijaya Nimma 16 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి చాలామందికి కరోనా అనంతరం శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బ తినటంతో పాటు, ముక్కు దిబ్బడ, జలుబు వంటి జబ్బులు రావటం చూస్తున్నాం. అయితే.. ఈ విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సైనసైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా.. ముక్కుదిబ్బడ వంటి సమస్యలతో పాటు జలుబు, దగ్గు , జ్వరం వంటి వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వేడినీటిలో అల్లం కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజు వేడినీటిలో అల్లం కలిపి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుదాం. అల్లం నీరు వల్ల ఉపయోగాలు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికం అల్లం శరీరంలో రోగనిరోధకశక్తి, ఇమ్యూనిటీని పెంచుతుంది అల్లం నీరులో విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ ఎక్కువ కీళ్ల, ఇతర నొప్పులను తగ్గించే గుణం అల్లానికి పుష్కలంగా ఉంది ప్రతీరోజు అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో అల్లం నీరు బెస్ట్ అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగాలి అల్లం దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి కోలుకునేలా చేస్తుంది అల్లం పొట్టుపై ఉండే విష పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి పొట్టును తీసి వాడికుంటే అరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు చలికాలంలో పెరిగే వాయుకాలుష్యం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలకు ఈ అల్లం నీరు సమస్యలను దూరం చేస్తుంది. విషపూరితమైన గాలి ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. శారీరక, మానసిక, గొంతు నొప్పి , నీరసం వంటి సమస్యలు ఈ వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా వస్తాయి. అందుకు వేటి నీటిలో అల్లం వేసి కొద్దిసేపు ఉడికించి ఆ నీటిని వడకట్టాలి.ఈ అల్లం కషాయంలో కొద్దిగా తేనే వేసుకొని తాగాలి. ఇలా రోజు చేస్తే శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్లను ఉంటే తగ్గుతాయి. అల్లం టీ తాగినా ఆరోగ్యానికి మంచి ప్రజయోనం ఉంటుంది. ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే రోజు ఉదయం ఈ డ్రింక్స్‌తో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదండి: పచ్చికొబ్బరి తింటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి #hot-water #health-benefits #ginger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి