APPSC Group 1: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తులకు గడువు పెంపు

గ్రూప్ -1 అభ్యర్థులకు ఊరట లభించింది. దరఖాస్తుల గడువును పెంచింది APPSC. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది. మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ నెల 21వ తేదీనే గడువు ముగిసింది.

New Update
Andhra Pradesh : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

APPSC Group 1 Exam: గ్రూప్ -1 అభ్యర్థులకు ఊరట లభించింది. దరఖాస్తుల గడువును పెంచింది APPSC. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది. మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఈ నెల 21వ తేదీనే గడువు ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరడంపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గతంలో 81 పోస్టులతో గ్రూప్‌ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్వీస్‌ కమిషన్‌. ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam) ఆబ్జెక్టివ్‌ తరహాలో మార్చి 17న నిర్వహించనున్నట్టు తెలిపింది. కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌-1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్‌ ట్యాక్స్‌ కమిషనర్స్‌ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌

ఏపీలో టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ గురించి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో డీఎస్సీ గురించి ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఎం (CM Jagan) ఆదేశాల మేరకు టీచర్‌ పోస్టుల గురించి ఓ నివేదిక సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ దశల్లో టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని వివరించారు.

ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు