Supreme Court: ఆ వికలాంగునికి ఉద్యోగం ఇవ్వండి: సుప్రీంకోర్టు

2008 లో సివిల్స్‌ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఓ అంధుడు అపాయింట్‌మెంట్ లెటర్ పొందేందుకు 16 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగాడు. చివరికి సుప్రీంకోర్టు అతన్ని అపాయింట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు 

అతను ఒక అంధుడు. 2008 లోనే సివిల్స్‌ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అపాయింట్‌ లెటర్ అందుకోవడానికి మాత్రం అతనికి 16 ఏళ్లు పట్టింది. దీనికి కారణం 'పర్సన్‌ విత్‌ డిసబిలీటీస్' చట్టాన్ని అమలు చేయకపోవడమే. ఇక వివరాల్లోకి వెళ్తే. పంకజ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి 100 శాతం అంధత్వం ఉన్న వ్యక్తి. అయినప్పటికీ అతను 2008లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షను క్రాక్ చేశాడు. ఇతనితో పాటు మరో 10 పదిమంది వికలాంగులు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ వీళ్లకు ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ లెటర్‌ను పొందలేకపోయారు.

Also Read: ముస్లిం మహిళలకు విడాకుల భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!

న్యాయం కోసం శ్రీవాస్తవ 2009 నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. చివరికీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్సన్స్‌ విత్‌ డిసిబిలిటీ యాక్ట్‌, 1995 నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. ఇలా చేసినందుకు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సన్‌ విత్ డిసబిలిటీ (PWD) కేటగిరీలో బ్యా్క్‌లాగ్ ఖాళీలు ఉన్నప్పటికీ.. శ్రీవాస్తవకు అపాయింట్‌ లెటర్‌ పొందటం కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొంది.

Also read: ఫేక్‌ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?

' ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)లో విజువల్లీ ఇంపేయిర్ట్‌( పుర్తిగా అంధత్వం) కేటగిరీలో కొన్ని బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. 2014 నుంచి అంధత్వం కేటగిరి అభ్యర్థులను ఐఆర్‌ఎస్‌లో సెలక్ట్ చేస్తున్నారు. ఐఆర్‌ఎస్‌ విభాగంలో పీడబ్ల్యూడీ (PWD) కేటగిరీ కింద మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. పీడబ్ల్యూడీ యాక్ట్‌, 1995 ప్రకారం.. శ్రీవాస్తవ, మరో 10 మంది మెరిట్‌ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చేసి ఉంటే శ్రీవాస్తవ తనకు న్యాయం జరిగేందుకు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది కాదని' ధర్మాసనం తెలిపింది. చివరికి మెరిట్‌ లిస్టులో ఉన్న శ్రీవాస్తవతో పాటు మరో 10 మందిని అపాయింట్‌మెంట్ లెటర్లు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు