TS New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ ​కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మండల ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిపారు.

New Update
TS: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్!

TS New Ration Cards : తెలంగాణ(Telangana)లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల(Telangana New Ration Cards) ప్రక్రియకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల లబ్ది పొందాలంటే రేషన్ కార్దు తప్పనిసరి అని వార్తలు ప్రచారం అవుతుండటంతో లక్షలాది మంది కొత్తరేషన్ కార్డుల దరఖాస్తు నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గవర్నమెంట్ అనౌన్స్ మెంట్ చేయడమే ఆలస్యం మీ సేవా కేంద్రాలముందు క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలను ఉద్దేశిస్తూ శ్రీధర్ బాబు సోమవారం కీలక ప్రకటన చేశారు.

ఈ మేరకు డిసెంబర్ 28న నాగ్ పూర్(Nagpur) లో కాంగ్రెస్ ​ఆవిర్బావ దినోత్సవం జరగనుంది. అయితే ఈ మీటింగ్ కోసం సోమవారం ఆదిలాబాద్(Adilabad) లో సన్నాహక సమావేశం నిర్వహించగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్రీధర్​ బాబు.. డిసెంబర్ 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ ​కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘గ్రామ సభల్లో ఆరు గ్యారంటీలతో పాటు రెవెన్యూ, స్థానిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, రేషన్​కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు అధిక జనాభా ఉన్న చోట రెండు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలని, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు పెట్టాలని, మండల ఆఫీసర్లను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Hyderabad: ఎస్‌ఆర్‌నగర్‌ లో డ్రగ్స్ దందా.. 25మందిని పట్టుకున్న పోలీసులు

అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిందని, మిగతా నాలుగు హామీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ అధికారం చేపట్టి వంద రోజులైన గడవకముందే బీఆర్ఎస్ బురదజల్లుతుందంటూ కేసీఆర్ టీమ్ ను తీవ్రంగా విమర్శించారు. ఇక ‘హమ్ తయ్యార్ హై’ నినాదంతో ఈ నెల 28న నాగ్ పూర్​లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ఇక ఈనెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న నాగ్ పూర్ సభకు పెద్ద సంఖ్యలు ప్రజలు హాజరుకావాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక నిర్వహించనున్న మొదటి సభ కాబట్టి తెలంగాణ భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆయన విజ్క్షప్తి చేశారు. 28 నుంచి6వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ఊరూరా ఆరు గ్యారరెంటీలపై అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. ఫ్రీ టికెట్ పెట్టడంతో ప్రయాణికులు పెరిగారని, మరో 2 వేల కొత్త బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు