Telangana elections:నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు..ఎవరెవరు చేసుకోవచ్చంటే..

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేయాలనుకునేవారు మాత్రం ఈరోజు నుంచి 7వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

New Update
Telangana elections:నేటి నుంచే పోస్టల్ ఓటుకు దరఖాస్తు..ఎవరెవరు చేసుకోవచ్చంటే..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల యింది. ఈరోజు నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. మరోవైపు ఎలక్షన్ ఏర్పాట్లను కూడా చేసేస్తున్నారు. నవంబర్ 30న రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేస్తారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం ఈవీఎంల ద్వారానే నిర్వహించనున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓట్లు వేయాలనుకుంటే మాత్రం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు ఎన్నికల నిర్వహణాధికారులు. ఈ రోజు నుంచి నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెబుతున్నారు.

Also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే నామినేషన్లు

ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటూ పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను స్వీకరిస్తారు. పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్ రెండూ పింక్ కలర్ లో ఉంటాయి. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో దరఖాస్తును తీసుకుంటారు. బూత్ లెవల్ అధికారికి 12డి ఫారం ద్వారా అప్లై చేసుకోవాలి.

తెలంగాణలో మొదటిసారి దివ్యాంగులు, 80ఏళ్ళ పైబడిన వారందరికీ ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును కల్పించింది ఎన్నికల సంఘం. వీరిలో కూడా 12డి ఫారమ్ ను ముందుగానే అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ అవకాశం ఉంటుంది. ఇక వారితో పాటూ అత్యవసర సేవలు అందిస్తున్న 13 శాఖల ఉద్యోగులు, సిబ్బంది, అధికారలకు కూడా పోస్ట్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. వీరు వారి శాఖ నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ఈ సారి ఫెనిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీరంతా ఇక్కడకు వచ్చి ఓటేయాలి. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు.

రాష్ట్రంలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. జనరల్ ఇన్ స్పెక్టర్లు, పోలీస్ ఇన్ స్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 60 మంది కాస్ట్ ఇన్ స్పెక్టర్లను నియమించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్‌లను సాధారణ పరిశీలకులుగా నియమించారు. శాంతి భద్రతల పరిశీలకులుగా 39 మంది ఐపీఎస్‌లను నియమించారు. ఈ నెల 10 నుంచి రాష్ట్రానికి వచ్చి తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పని చేయనున్నారు. వారి ఫోన్ నంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రెండు నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని పరిశీలకులుగా నియమించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు