AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు!

కాలుష్య నియంత్రణమండలి,ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైళ్లను విజయవాడ-అవనిగడ్డ కరకట్ట పై తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.వీటిలో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా,మరికొన్ని కాలుష్య నియంత్రణమండలికి చెందిన హార్డ్‌ డిస్కులు ఉన్నాయి.

New Update
AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు!

Government Files Burnt: కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు (APMDC) చెందిన బస్తాల కొద్ది దస్త్రాలను విజయవాడ - అవనిగడ్డ కరకట్ట (Karakatta) పై బుధవారం రాత్రి తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఇందులో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా, మరికొన్ని కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్‌ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ కు చెందిన దస్త్రాలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్ట వద్దకు వచ్చారు. ఈ వాహనం పై గవర్నమెంట్‌ వెహికల్‌ అనే స్టిక్కర్‌ కూడా ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లో ఫైళ్లను కరకట్ట పై తగలపెట్టడం మొదలు పెట్టారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ టీడీపీ నేత ఈ విషయాన్ని గమనించారు. ఫైళ్ల పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్‌ సమీర్‌ శర్మ (Sameer Sharma) ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ టీడీపీ నేత వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, టీడీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో పెదపులిపాక టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అక్కడికి వచ్చారు.

వారు రావడం గమనించిన ఇన్నోవాలోని వారు యనమలకుదురు వైపు పారిపోయారు. టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్‌ శర్మ ఆదేశాలతోనే ఈ ఫైళ్లను తగలపెట్టినట్లు ఇన్నోవా డ్రైవర్‌ నాగరాజు వివరించాడు.

Also Read: కుప్పకూలిన నేపాల్‌ ప్రభుత్వం..ప్రధాని ప్రచండకు పదవీ గండం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

New Update

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ పోలీసులు మరో బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే కపలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఫిబ్రవరిలో అరెస్ట్..

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లో పోలీసులు హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సీఐడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్

నెల రోజులకు పైగా జైల్లో..

దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు. కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని.. రూ.2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది. నాలుగు వారాల పాటు ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు మంగళగిరి లోని ఏపీ సీఐడీ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది. 

(posani krishna murali arrest | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment