Vasireddy Padma: పవన్ కళ్యాణ్ సినిమాలతోనే మహిళల మిస్సింగ్: వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. పిచ్చిపుత్రుడు కూడా అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళ మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్.. పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా... By E. Chinni 27 Jul 2023 in రాజకీయాలు Scrolling New Update షేర్ చేయండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్రం మహిళల మిస్సింగ్ డేటా బయటపెట్టడంతో దీనిపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారంటూ పవన్ హడావిడి చేస్తున్నారని, టాప్ టెన్ లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లోని మహిళల మిస్సింగ్ గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు తాపత్రయపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు విషయం చిమ్ముతున్నారని అడిగారు. మీది రాజకీయపరమైన కోపమా? రాష్ట్రం మీద కోపమా? అని నిలదీశారు. 11వ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎదుకు ప్రస్తావించడం లేదన్నారు. రాజ్యసభలో కొంతమంది ఎంపీల చేత అడిగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. పిచ్చిపుత్రుడు కూడా అని వాసిరెడ్డి పద్మ తెలిపారు. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళ మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్.. పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా మహిళల మిస్సింగ్స్ జరుగుతుందో చెప్పగలరా? అని నిలదీశారు. సినిమాల ద్వారా లవ్ స్టొరీలు తీస్తున్న పవన్ కళ్యాణ్, ఆయన ప్రొడ్యూసర్స్ మహిళల మీద దాడులకు ప్రేరేపించడం లేదా? అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళు గౌరవంగా ఉండడానికి వాలంటీర్స్ ఒక కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు సంబంధించి అన్ని పథకాలను వాలంటీర్స్ ఇంటికి తీసుకెళుతున్నారన్నారు. మహిళలు సమక్షంలో రచ్చబండ పెడదాం, పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే రచ్చబండకి రావాలని సవాల్ విసిరారు. పవన్ కు మహిళలతో ఆడుకోవడం మాత్రమే తెలుసన్నారు. సీఎం జగన్ కు మహిళల్ని ఆదుకోవడం మాత్రమే తెలుసన్నారు. పవన్ తీస్తున్న సినిమాల వల్లనే మహిళలు అదృశ్యం అవుతున్నారన్నారు మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. కాగా కేంద్రం ప్రకటించిన డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపారు. 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు, 2020లో 3,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు, 2021లో 3,358 మంది బాలికలు, 8,869 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. #pawan-kalyan #ap-news #latest-news #political-news #vasireddy-padma #hot-comments #ap-women-commission-chief-vasireddy-padma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి