SIT : ఏపీలో హింసపై రంగంలోకి సిట్.. వారిపై కఠిన చర్యలు! ఏపీలో అలర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ చైర్మన్ వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిశారు. క్షేత్ర స్థాయిలో వారి పర్యటనలో పరిశీలించిన విషయాలను డీజీపీకి వివరించారు. By Nikhil 18 May 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Andhra Pradesh : ఎన్నికల (Elections) తర్వాత ఏపీలో చెలరేగిన హింసపై ఏర్పాటు చేసిన సిట్ యాక్షన్ (SIT Action) ప్రారంభించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta) తో సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ ఈ రోజు భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ సమావేవం జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టు డీజీపీకి వినీత్ తెలిపారు. అల్లర్ల (Violence) కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అల్లర్లకు పాల్పడ్డ వారిపై నమోదు చేసిన FIRలను సిట్ పరిశీలించనుంది. FIRలలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా..? లేక సెక్షన్లు మార్చాలా..? అన్న అంశంపై సిట్ నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు అల్లర్లకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేయనుంది. మరో వైపు అలర్ల పాల్పడిన వారి అరెస్టులపై సిట్ ఆరాతీస్తోంది. Also Read : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు #elections #dgp #sit #violence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి