AP Sankranti Special Trains : సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త.. హైదరాబాద్ నుంచి 20 స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!

సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన స్పెషల్‌ ట్రైన్ల లిస్ట్‌ ను కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలో ఉంచింది.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

Sankranti : సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్‌(Hyderabad) నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన స్పెషల్‌ ట్రైన్ల లిస్ట్‌ ను కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలో ఉంచింది.

సంక్రాంతి పండుగ ఇంకా నెల రోజులు ఉంది అనగానే సొంతూర్లకు వెళ్లే వారి హడావిడి మొదలైపోతుంది. నగరాల్లో బిజీబిజీగా గడిపేవారు ఓ వారం రోజులు ప్రశాంతంగా గడపడానికి ముందు నుంచే ప్లాన్‌ చేసుకుంటుంటారు. కానీ ఊర్లకు వెళ్లాలంటే బస్సు, ట్రైన్‌ జర్నీలు చేయాల్సిందేగా మరి. కానీ ఆ బస్సులు, ట్రైన్లు సుమారు నెలన్నర ముందు నుంచే బుక్‌ అయిపోతాయి. దీంతో చాలా మంది నిరుత్సాహ పడుతారు. అలాంటి వారికి రైల్వే శాఖ ఓ తీపి కబురు చెప్పింది.

సంక్రాంతికి ఏపీకి హైదరాబాద్‌ నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాచిగూడ నుంచి కాకినాడ కి డిసెంబర్‌ 28 నుంచి జనవరి 4,11,18, 25 తేదీల్లో సాయంత్రం కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయానికి కాకినాడకు చేరుకుంటుంది. కాకినాడ టౌన్‌ - కాచిగూడ ట్రైన్‌ డిసెంబర్‌ 29, జనవరి 5,12,19, 26 తేదీల్లో సాయంత్రం కాకినాడ నుంచి బయల్దేరి మరసటి రోజు ఉదయం కాచిగూడ కు చేరుకుంటుంది.

హైదరాబాద్‌- తిరుపతి ట్రైన్‌ డిసెంబర్‌ 28, జనవరి 4,11, 18, 25 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి బయల్దేరి తరువాత రోజు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి- హైదరాబాద్‌ ట్రైన్‌ డిసెంబర్‌ 29, జనవరి 5,12, 19, 26 తేదీల్లో తిరుపతిలో బయల్దేరి తరువాత రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకుంటుంది.

కాకినాడ వెళ్లే రైళ్లు కాచిగూడ నుంచి మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతూ కాకినాడ చేరుకుంటాయి.

తిరుపతికి వెళ్లే రైళ్లు హైదరాబాద్ ( నాంపల్లి )నుంచి బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి.

Also read: అమ్మా శ్రీలీల ఎంత పని చేశావు.. ఏం డెడికేషన్‌ ఇది!

Advertisment
Advertisment
తాజా కథనాలు