AP DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల! ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నెల 12 నుంచే దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ కూడా విడుదల అవ్వడంతో అభ్యర్ధులు, నిరుద్యోగులు రిలాక్స్ అవుతున్నారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం సిద్ధం అవుతున్నారు. By Trinath 07 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి AP DSC Notification 2024: మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి కేబినెట్ ఓకే చెప్పగా..తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 12 నుంచే పరీక్షలకు అప్లికేషన్ ఫామ్‌లను కూడా తీసుకోనున్నారు. ఈ నెల 22 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం అన్నారంటే : --> ఏపిలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ --> ఫిబ్రవరి 12 తేదీ నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ.. --> టెట్ పరీక్ష ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు --> మార్చి 5న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ --> మార్చి 14న టెట్ రిజల్ట్ --> మార్చి 15 నుంచి మార్చి 30 వరకు డీఎస్సీ పరీక్షలు --> మార్చి 31న డీఎస్సీ ప్రాధమిక కీ విడుదల --> ఏప్రిల్ 2న ఫైనల్ కీ --> ఏప్రిల్ 7న ఫలితాల ప్రకటన --> అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలోని ఖాళీలను భర్తీ --> 6100 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం --> ఫిబ్రవరి 12 తేదీ నుంచి ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాలు వెల్లడి.. --> 2280 ఎస్జీటీ పోస్టులను --> 2299 స్కూల్ అసిస్టెంట్ లు --> 1264 టీజీటి . --> 215 పిజిటి లు --> 242 ప్రిన్సిపాల్ నియామకం 12 ఏళ్ళ క్రితం తొలగించిన అప్రెంటీస్‌షిప్ విధానాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ళపాటూ గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలను పాటించకపోతే వారి అప్రెంటీస్‌షిప్‌ను పొడిగిస్తారు. అలాగే ఈసారి డీఎస్సీ, టెట్ (TET) ఎగ్జామ్స్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా (Computer Based Exam) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ టీసీఎస్‌తో (TCS) ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. Also read:Telangana:ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఐదేళ్ళల్లో ఇదే మొదటిసారి.. నిజానికి ఏపీలో వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) కూడా విడుదల చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న జగన్ (CM Jagan) ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టుల (Teacher Posts) భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. ఇక ఎన్నికలకు మరి కొన్ని నెలలే టైమ్ ఉండడంతో ప్రభుత్వం మెగా డీఎస్సీ (AP Mega DSC) విడుదల చేయకుంటే డీఎస్సీ అభ్యర్థుల నుంచి తిరుగుబాటు తప్పదన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇటు ప్రతిపక్షం టీడీపీ సైతం ఇదే విషయంలో వైసీపీని కార్నర్ చేస్తూ వచ్చింది. ఇది అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషణలు వినిపించాయి. దీంతో నిరుద్యోగ యువతను తమవైపునకు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా డీఎస్సీకి రాష్ట్ర కేబినెట ఆమోదం తెలపడం..నోటిఫికేషన్ కూడా విడుదల అవుతుండండతో అభ్యర్ధులు, నిరుద్యోగులు రిలాక్స్ అవుతున్నారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం సిద్ధం అవుతున్నారు. #andhra-pradesh #tet #ap-dsc #ap-dsc-notification-2024 #mega-dsc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి