AP Free Bus Scheme : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. న్యూ ఇయర్ నుంచే బస్సుల్లో ఫ్రీ జర్నీ? ఏపీలోనూ ఫ్రీ బస్ స్కీమ్ ను స్టార్ట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. By Nikhil 24 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Good News For AP Women's : మహిళలకు ఫ్రీ బస్(Free Bus) జర్నీ.. ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ పదం ఇదే. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. అయితే.. అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే ఈ పథకాన్ని పట్టాలు ఎక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఈ పథకం ఇప్పుడు విజయవంతంగా అమలు అవుతోంది. గత కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించిన స్కీంలలో ఇది ఒకటి. అక్కడ కూడా ఈ పథకం అమల్లో ఉంది. ఎలాగైనా ఏపీలో అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు.. ఈ ఫ్రీబస్ స్కీం హామీని ప్రకటించేశారు. ఇది కూడా చదవండి: ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. దీంతో అలర్ట్ అయిన సీఎం జగన్.. ఒక అడుగు ముందుకేసి ఎన్నికల వరకు ఆగకుండా ముందే ఈ స్కీమ్ ను అమలు చేస్తే పోతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ స్కీమ్ అమలుకు ప్లాన్ మొదలు పెట్టినట్లు సమాచారం. జగన్ ఆదేశాలతో తెలంగాణ అధికారులతో APSRTC అధికారులు చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. - బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇందుకు ఎంత ఖర్చు అవుతోంది? తదితర విరరాలను APSRTC అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. #apsrtc #andhra-pradesh-cm-jagan #free-bus-in-andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి