పోలవరంపై ఎందుకంత నిర్లక్ష్యం.. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం ఫైర్ అయింది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఏ మాత్రం సీరియస్‌నెస్‌ లేదంటూ చురకలంటించింది. మరో 15 రోజుల్లో నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసి చూపించాలని ఆదేశించింది.

New Update
పోలవరంపై ఎందుకంత నిర్లక్ష్యం.. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం

Polavaram Irrigation Project Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)నిర్మాణంలో వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్‌నెస్‌ లేదని, గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. అలాగే చెప్పినా వినకుండా నీళ్లు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే బాధ్యులెవరనీ నిలదీసింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని, అప్పటికి నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసుకుని రావాలని ఆదేశించింది.

ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై మంగళవారం ఢిల్లీ (Delhi)లో సమావేశం నిర్వహించిన కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌.. అనేక అంశాల్లో రాష్ట్ర అధికారుల తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఏపీనుంచి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక ఏమిటనీ దేబశ్రీ ముఖర్జీ వారిని ప్రశ్నించారు. 2024 జూన్‌ నాటికి పూర్తిచేయాలని తమ ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పడంతో ఇది ఆచరణాత్మక ప్రణాళికేనా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also read :తెలంగాణకు ఐటీ మంత్రి ఆయనే.. కేటీఆర్ కంటే డైనమిక్ అంటున్న నెటిజన్లు

అలాగే పోలవరంలోని ఎన్నో అంశాలు పరిష్కారం కావాల్సి ఉండగా అప్పటికి ప్రాజెక్టు పూర్తిచేయగలమని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని, కేంద్ర జలశక్తి తమను బాధ్యులను చేస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనందన్‌ కుమార్‌ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీచేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. దీంతో కేంద్ర కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, నీళ్లు నింపడం ఎంత ప్రమాదమో తెలుసా? అని దేబశ్రీ ప్రశ్నించారు. కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని ఆమె నిలదీశారు. ఎగువ కాఫర్‌డ్యాం మరమ్మతులకు, నీటిని ఎత్తిపోస్తున్న ఖర్చుల్ని కేంద్రం చెల్లించబోదని తేల్చిచెప్పారు. ప్రైమ్‌ ఆఫ్‌ వీర సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలని రెండేళ్లుగా చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేశామని, తేదీలు మాత్రమే అనుసంధానం చేయలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. తేదీలతో అనుసంధానం చేయకపోతే ఆ సాఫ్ట్‌వేర్‌ వల్ల ప్రయోజనం ఏమిటని ఆమె ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు.

అలాగే మరో 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించగా.. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీ సమస్యపై అధ్యయనానికి తాము వెళ్లినప్పుడు అక్కడ అధికారులు గేలి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ డైరెక్టర్‌ కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో దేబశ్రీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌ సైతం పోలవరం పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడవలసి వస్తోందని ఆయన అన్నారు. ఇప్పటివరకు పనులు చేయకుండా ఎన్ని సీజన్లు వెళ్లిపోయాయో గుర్తించారా అని ఆయన నిలదీయగా, అధికారులెవరూ స్పందించలేదు. నాలుగు సీజన్లు నష్టపోయామని ఆయనే వెల్లడించారు. సీపేజీ గురించి తాము ముందే హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని శ్రీరామ్‌ ప్రశ్నించారు. గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి బాధ్యత ఎవరిదో ఇంకా నిర్ధారించలేదని ప్రస్తావించారు. ఇప్పుడు సీపేజీ సమస్య తలెత్తిందన్నారు. పోలవరంలో ఎంఓయూ కుదుర్చుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరుగుతుందని కేంద్రపెద్దలు పేర్కొన్నారు. ఇక అక్కడి నుంచి సిఫార్సు వచ్చాక ప్రధాని అధ్యక్షతన ఉన్న పెట్టుబడి అనుమతి కమిటీకి పంపిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తొలిదశలో మొత్తం రూ.31,625 కోట్లకు కేంద్ర జలసంఘం ఇచ్చిన సిఫార్సులను రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ పది రోజుల్లో పరిశీలించి తేల్చి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: జగన్ కు ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుడిగా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ జగన్ కు లేఖ రాశారు. PACలో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు త్రికణశుద్ధిగా పని చేస్తానన్నారు.

New Update
Mudragada Padmanabham YS Jagan

Mudragada Padmanabham YS Jagan

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment