AP government jobs:ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబ‌రు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

New Update
AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!!

ఏపీలో నిరుద్యోగుల పంట పండనుంది. యూనివర్శిటీల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. దీంతో వేలమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబ‌రు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న ప్రొఫెసర్‌లకు 10 శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో అధ్యాపకుడి అకడమిక్‌గా సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్‌తో కమిటీని నియమించామని వివరించారు.

Also Read:ఆ నగరాల్లో ఉంటున్న వారు జాగ్రత్త-మళ్ళీ కాలుదువ్విన కెనడా

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాల‌యాల్లో చాలా ఏళ్ళుగా ప్రొఫెసర్లను నియామకాలు జరగడం లేదు. యూనివ‌ర్శిటీల్లో శాశ్వత అధ్యాప‌కుల నియామ‌కాలు చేప‌ట్టి 17 ఏళ్ళు అయింది. ఖాళీ అయిన పోస్టుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధతిన టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఉన్నత విద్యా రంగంలో మార్పులు చేయాలనుకుంటున్న ప్రభుత్వం ముందు అధ్యాపకుల పోస్ట్‌లతో మొదలుపెట్టానుకుంటోంది. రాష్ట్రంలో ఉన్న 18 ప్రభుత్వ విశ్వవిద్యాల‌యాల్లో సుమారు 12 ల‌క్షల మంది విద్యార్ధులు చ‌దువుతున్నారు. వీరంద‌రికీ నాణ్యమైన‌, ఆధునిక సాంకేతిక‌తో కూడిన విద్యనందించేలా ముందుకెళ్తున్నట్లు ఉన్నత‌ విద్యా మండ‌లి ఛైర్మన్ హేమ‌చంద్రారెడ్డి తెలిపారు.

Also Read:చంద్రబాబు కేసులను వచ్చే నెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు