AP Game Changer : గుంటూరులో గెలిచేదెవరు?.. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!

గుంటూరు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ సీటులో విజయం ఎవరిది? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి.

New Update
AP Game Changer : గుంటూరులో గెలిచేదెవరు?.. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!

AP Elections 2024 : గుంటూరు జిల్లా(Guntur District) లోని మంగళగిరి బరిలో TDP నుంచి నారా లోకేష్(Nara Lokesh) ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి వల్ల లోకేష్‌కు సింపతీ ఫ్యాక్టర్ పనిచేస్తోంది. లోకేష్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందన్న భావన ఇక్కడి ఓటర్లలో కనిపిస్తోంది. రాజధాని ఎఫెక్ట్ ఇక్కడ టీడీపీకి ప్లస్ పాయింట్. ఇక వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మైనస్ అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుతో కొన్నిచోట్ల వైసీపీ క్యాడర్ పార్టీకి దూరమైంది. మొత్తంగా నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.

publive-image

తెనాలిలో..
ఆంధ్రా ప్యారిస్ అని చెప్పుకునే తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు. గతంలో ఇక్కడ చేసిన అభివృద్ధి ఆయనకు కలిసి వచ్చే అంశం. తెనాలి సెగ్మెంట్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన కాపు, కమ్మ సామాజికవర్గాలు జనసేన కోసం పనిచేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు అవినీతి ఆరోపణలు మైనస్ అవుతున్నాయి. తెనాలి టౌన్‌లో ఆర్యవైశ్యులు దూరంగా ఉండడం కూడా వైసీపీ(YCP) కి ఇబ్బందే. కాస్త టైట్ ఫైట్ కనిపిస్తున్నా నాదెండ్ల గెలిచే అవకాశం ఉందని RTV స్టడీ చెప్తోంది.
publive-image

రేపల్లెలో..
రేపల్లెలో వైసీపీ అభ్యర్థి ఈవూరు గణేష్‌కు కుటుంబ రాజకీయ నేపథ్యం కలిసొస్తుంది. వివాద రహితుడు కావడం ప్లస్ పాయింట్. వైసీపీ నుంచి టీడీపీ(TDP) లోకి వలసలు పెరగడం కొంత మైనస్. కులసమీకరణలు ఈవూరుకు అడ్వాంటేజ్ అవుతున్నాయి. మొత్తంగా వైసీపీ అభ్యర్థి ఈవూరు గణేష్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్లు RTV స్టడీలో తేలింది.
publive-image

Also Read : మిస్‌ యూ చెల్లెమ్మా..షర్మిల పై జగన్‌ ఆసక్తికర విషయాలు!

ఇతర నియోజకవర్గాల్లో..
పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్, పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరులో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు, బాపట్లలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి, ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గెలిచే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇంకా..
publive-image

గుంటూరు వెస్ట్ లో టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి, గుంటూరు ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్, చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గెలిచే అవకాశం ఉంది.

publive-image

సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు