Andhra Pradesh: ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

ఏపీలో తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

New Update
Andhra Pradesh: ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

CM Chandra Babu: ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజి ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఈ కొత్త పాలసీని ముందుకు నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించడమే దీని ధ్యేయం. దీని మీద ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పాలసీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా పని చేయాలి అనే విషయాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని ...వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రం అవుతుందని సీఎం అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలోనే టాప్ లో ఉన్న ఆంధ్రా...2019 తరవాత వచ్చిన ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా, టెక్నాలజీ ఉపయోగంతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని చంద్రబాబు చెప్పారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను మరింత విస్తృతంగా స్టడీ చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని సిఎం అన్నారు. 2029 కి, 2047 నాటికి విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిని మదింపు చేసి పాలసీ సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. రాష్ట్రంలో కనీసం 500 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు పెట్టాల్సిన ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు, సంస్థలు స్వయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం, తమ అవసరాలు తీరిన తరువాత మిగిలిన విద్యుత్ ను అమ్ముకోవడాన్ని సులభతరం చేసేలా పాలసీ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో లభించే క్వార్జ్ట్ ఖనిజం ద్వారా సోలార్ విద్యుత్ పానెళ్ళు తయారు చేస్తారని....అందుకే వాటి తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైనా దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు.

Also Read: Rajastan: వంద మందిని రేప్‌ చేసిన నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు