Vizag Steel Palnt: స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. విశాఖ ఉక్కును స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేయాలని కోరుతూ.. బీజేపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు రెండు నెలల్లో మరోసారి సమావేశం కానున్నారు. By B Aravind 26 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ఏపీ బీజేపీ ముందడుగు వేసింది. ఈ మేరకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురుందేశ్వరి, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌లు.. కుమారస్వామితో ఈ వ్యవహారంపై చర్చలు జరిపారు. విశాఖ ఉక్కును స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేయాలని కోరుతూ.. బీజేపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. అలాగే స్టీల్ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ను కూడా కుమారస్వామికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. అయితే బీజేపీ ఎంపీలు వివరించిన అంశాలపై కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై రెండు నెలల్లో మరోసారి సమావేశమవుదామని వాళ్లతో చెప్పారు. Also Read: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్న మొత్తం కేసులెన్ని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? #telugu-news #bjp #bjp-purandeswari #vizag-steel-plant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి