AP Politics: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు

బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వైసీపీ సర్కార్ పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి దసరా అంటూ ధ్వజమెత్తారు. తిరుమల ఈవో జగన్ ఏజెంట్ గా మారాడని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ విశాఖకు మారడం.. దోచుకోవడానికేనంటూ ధ్వజమెత్తారు.

New Update
AP Politics: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు

వైసీపీ ప్రభుత్వానికి (YCRCP Government) ఇదే ఆఖరి దసరా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. వచ్చే దసరాకు వైసీపీ నామ రూపాల్లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. తిరుమల (TTD) ఈవో జగన్ ఏజెంట్ గా తయారయ్యారని ఆరోపించారు. అక్కడ వైసీపీ నాయకులకు వన్ పర్సెంట్ కమిషన్ వస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ మళ్ళీ గెలిస్తే అది 10 పర్సెంట్ కు పెరుగుతుందని ధ్వజమెత్తారు. హిందువులు అందరూ మేల్కోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ రౌడియిజానికి పుంగనూరు ఘటన నిదర్శనమన్నారు. జగన్ పుంగనూరుని పెద్దిరెడ్డికి (Minister Peddireddy) రాసిచ్చేశాడా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Chandrababu:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్

పుంగనూరులో ఉత్తరాంధ్ర వాసులపై జరిగిన దాడిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. ఉత్తరాంధ్ర వాసుల బట్టలిప్పి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. వారి స్థానంలో మహిళలున్నా వైసీపీ మూకలు అదే చేస్తారని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎంతమంది రౌడీ షీట్ లు తీశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ కి మళ్ళీ అధికారం ఇస్తే అందర్నీ అమ్మేస్తాడన్నారు. జగన్ విశాఖ వచ్చేది ఉత్తరాంధ్ర ని అభివృద్ధి కోసం కాదని.. ఇక్కడి ఆస్తులను దోచుకోవడానికన్నారు.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneshwari: ప్రజాక్షేత్రంలోకి భువనేశ్వరి.. నారావారిపల్లెకి చంద్రబాబు సతీమణి! వాట్ నెక్ట్స్?

చంద్రబాబును దుర్మార్గంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు చెత్త రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు 45 రోజులుగా జైల్లో ఉండడం దురదృష్టకరమన్నారు. 86 ఐటీ కంపెనీలకు రూ.21 కోట్లు ఇంటెన్సివ్ లు ఇవ్వాల్సి ఉందన్నారు. వాటి సంగతి ఎంటో ఐటీ మంత్రి అమర్నాధ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ఫోసిస్ ఇనాగరేషన్ కి ఏ ఐటీ కంపెనీ సీఈఓకి ఆహ్వానం అందకపోవడానికి ఇదే కారణమన్నారు. తనపై పోటీ చేయాలని కోరడానికి జగన్ ను అపాయిట్మెంట్ కోరుతున్నట్లు చెప్పారు విష్ణుకుమార్ రాజు.

Advertisment
Advertisment
తాజా కథనాలు