Health Benefits: ఎంతటి థైరాయిడ్ అయినా ఇవి తింటే తగ్గాల్సిందే! మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి అనేది అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీవక్రియలను కంట్రోల్ చేయడం, బరువు, శక్తిని కంట్రోల్ చేస్తుంది. By Vijaya Nimma 02 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన గ్రంథులల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి అనేది అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీవక్రియలను కంట్రోల్ చేయడం, బరువు, శక్తిని కంట్రోల్ చేస్తుంది. కిడ్నీలు, గుండెలాంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పనితీరును పెంచడంలో థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతకాలంలో అనేక మంది హైపో థైరాయిడిజంతో సతమతమవుతున్నారు. ఈ సమస్య ఉంటే జీవితాంతం మందులువాడాల్సి ఉంటుంది. అలాగే ఈ హైపో థైరాయిడిజం ఉన్నవారు నీరసం, మలబద్ధకం, బరువు పెరగడం, చర్మం పొడిబారడంలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది కూడా చదవండి: గాలిని శుద్ధి చేసే మొక్కలు..ఇంట్లో ఉండాల్సిందే చేపలను తినడం బెస్ట్ హైపో థైరాయిడిజం అదుపులో ఉండాలంటే మందులతో పాటు కొన్ని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలతో థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగుంటుంది. సమస్య తీవ్రతరం కాకుండా ఉంటుంది. హైపో థైరాయిడిజం వల్ల చెడు కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలలో ఎక్కువశాతం ఉంటాయి. మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో చేపలను తినడం వల్ల మనకు కావాల్సినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు దొరుకుతాయి. చేపలను వీలైనంతగా ఉడికించి తీసుకోవాలి. నూనెలో వేయించినవి అస్సలు తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరు థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగుండాలంటే బ్రెజిల్‌నట్స్, మకాడమియానట్స్‌తో పాటు హజెల్ నట్స్ చాలా ఉపయోగపడతాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటిలో ఉండే సెలెనియం థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపరచడంతో పాటు హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. హైపో థైరాయిడిజం ఉన్నవారికి మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు తినాలి. ఇందులోని ఫైబర్ పేగు కదలికలను పెంచి మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే కొవ్వులు తక్కువగా ఉండే పెరుగును తీసుకుంటే మంచిది. పెరుగు, పాల ఉత్పత్తుల్లో అయోడిన్ ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథి పెరుగుదలను నివారించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు కప్పు కొవ్వు తక్కువగా ఉండే పెరుగు తినాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. #food #eating #thyroid #problem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి