Vande Bharat : ఈరోజు నుంచి సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగెట్టనున్న మరో వందే భారత్...! విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. By Bhavana 12 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Vande Bharat Will Start Today : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి మరో వందే భారత్(Vande Bharat) రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. సౌత్ సెంట్రల్ రైల్వే లో ఈరోజు ప్రారంభం అయ్యే వందే భారత్ నాలుగో రైలు. ఈ వందే భారత్ సికింద్రాబాద్(Secunderabad) నుంచి విశాఖ(Visakha) మధ్య మరోసారి పరుగులు పెట్టడానికి రెడీ అయ్యింది. తెలంగాణ(Telangana) లో ఇది నాలుగో వందే భారత్. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఓ వందే భారత్ నడుస్తుండగా.. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో వందే భారత్ ను అధికారులు ప్రారంభించారు. ఈ రైలు బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వెళ్తుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు తొలి వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్ - విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఈ వందేభారత్ సికింద్రాబాద్‌లో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు బయల్దేరుతుంది. విశాఖలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయల్దేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం కు బయల్దేరగా మధ్యలో ఒక్కో స్టేషన్ లో కేవలం ఒక నిమిషం మాత్రమే ఆగుతుంది. విజయవాడలో మాత్రం ఐదు నిమిషాల పాటు ఆగుతుందని అధికారులు వివరించారు. ఈ రైలులో ఏడు ఏసీ చైర్ కోచ్ లు, ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ (Modi) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. Also Read : రంజాన్ మాసం ప్రారంభం అయిపోయింది..ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! #modi #train #secundrabad #vizag #vande-bharat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి