Nizamabad Serial Murder Case: నిజామాబాద్ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్..ఏడో హత్య కూడానా?

నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వెచ్చింది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహాకారంతో హత్యలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభించలేదని..సుశీల బతికే ఉందా? చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్‌తో అక్కడ పొడిచి చంపిన భార్య!

Nizamabad Serial Murder Case: నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్తికోసమే పక్కా ప్లాన్ తో ఆరుగురిని చంపిన ప్రధాన నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటకు తీసుకెళ్లి హత్య చేశాడు.

ఈ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్ నెలకొంది. మ్రుతుడు ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఆమె బతికే ఉన్నారా లేదంటే ఆమెను కూడా చంపేశాడా అనే అనుమానం నెలకొంది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహకారంతో హత్యలు చేసినట్లు నిందితుడు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. ఆస్తి కోసమే ఫ్రెండ్ ప్రసాద్ కుటుంబాన్ని చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు ప్రశాంత్. నేరం బయటకు రాకుండా ఒక్కొక్కరిని ఒక్కోచోట కాల్చి చంపాడు. ఈ ఆరుగురి హత్యల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముగ్గురిని తాను ఒక్కడినే చంపానని ఒప్పుకున్న ప్రశాంత్..మరో మూడు హత్యల్లో తన స్నేహితుల సహాయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

నిజమాబాద్ సదాశివ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లుర్ కు నుంచి కొంతకాలం క్రితం మాచారెడ్డికి వలస వచ్చిన ప్రసాద్ ఫ్యామిలీ ఇక్కడే స్థిరపడింది. అయితే ప్రసాద్ కు మాక్లుర్ లో సొంత ఇళ్లు ఉంది. అయితే ప్రసాద్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిన మాక్లుర్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ (20 ఏళ్లు) ఆ ఇంటిపై కన్నేశాడు. ప్రసాద్ కు ఆర్థిక అవసరాలను గుర్తించిన ప్రశాంత్ లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ ఇంటిని తన పేరుపై ప్రశాంత్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే లోన్ రాకపోవడంతో కొన్నాళ్లు వెయిట్ చేసిన ప్రసాద్.. తన ఇంటిని తిరిగి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. అయితే ఎలాగైనా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ కొంతకాలం వాయిదావేస్తూ వచ్చాడు. అయితే ప్రసాద్ మరింత ఒత్తిడి చేయడంతో ఎలాగైన వదిలించుకోవాలని ప్లాన్ చేసిన ప్రశాంత్.. నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రసాద్ ను హతమార్చాడు. అయితే ప్రసాద్ కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక రోజు తర్వాత ప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రశాంత్.. ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆయన భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆమె డెబ్ బాడీని బాసర నదిలో వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికొచ్చాడు. అయితే ఇదే అదనుగా భావించిన ప్రశాంత్.. ఒక్కొక్కరిగా అందరినీ హత్య చేసేందుకు ప్లాన్ చేసి తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని చంపేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల ప్రాణం తీశాడు. అయితే మొదటి మూడు హత్యలు ఒక్కడే చేయగా.. మిగిలిన మూడు మరో ముగ్గురి సహాయంతో చేశాడు. చనిపోయిన వారందరూ ఒకే ఫ్యామిలీ కావడంతో ఎవరూ మిస్సింగ్ కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇక డిచ్‌పల్లి హైవే దగ్గర ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రశాంత్ సదాశివనగర్‌లో ప్రసాద్‌ చెల్లి మృతదేహన్ని పాతిపెట్టాడు. బాసర గోదావరి నదిలో ప్రసాద్‌ భార్య డెడ్‌బాడీని పడేయగా.. బాల్కొండ సొన్ బ్రిడ్జి సమీపంలో ప్రసాద్‌ ఇద్దరు పిల్లల మృతదేహాలున్నాయి. మాచారెడ్డిలో ప్రసాద్‌ మరో చెల్లి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా నేడు పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్​పై ఐటీ రైడ్స్ – రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime: ఎంతకి తెగించావ్‌ రా.. తుపాకీ గురిపెట్టి దళిత మహిళపై రేప్‌

యూపీలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మెయిన్‌పురి జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. చివరికి బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

అయితే ఆ దళిత మహిళ భర్త తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. దీన్ని ఆ నిందితుడు ఆసరాగా చేసుకున్నాడు. అతని భార్యకు రూ.20 వేలు అప్పుగా ఇస్తానని నమ్మించాడు. ఓ బ్రిడ్జి వద్ద తన కొడుకుతో ఆమె ఉంది. దీంతో మోటార్‌ బైక్‌పై ఆ నిందితుడు వచ్చాడు. వాళ్లిద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

అక్కడ ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తుపాకీతో బెదిరించి మరీ ఆమెను రేప్ చేశాడు. ఎదురు తిరిగితే తుపాకీతో కాల్చేస్తానంటూ ఇద్దరిని బెదిరించాడు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో వాళ్లు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యుల బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.    

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

rtv-news | rape | Uttar Pradesh 

Advertisment
Advertisment
Advertisment