Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం!
ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Punjab Vs Hyderabad Match : ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ (SRH) టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఇంకో ఐదు బంతులు మిగులుండగానే టార్గెట్ ని అలవోకగా చేధించింది.
ఈ మ్యాచ్ కంటే ముందే ప్లే ఆఫ్స్ (Play Offs) కి క్వాలిఫై అయిన హైదరాబాద్.. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరింది. కాగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మొదటి ఓవర్ తొలి బంతికే ఔటైనా.. అభిషేక్ శర్మ(66) దంచికొట్టాడు. రాహుల్ త్రిపాఠి(33), నితీశ్ రెడ్డి(37), క్లాసెన్(42) మెరుపులు మెరిపించారు.
ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
స్టాక్ మార్కెట్లో ఇంతలా డైనమిక్ ఛేంజ్ లు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో. నిన్న మార్కెట్లు అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2226 పాయింట్లు (2.95%) పడిపోయి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (3.24%) పడిపోయి 22,161 వద్ద ముగిసింది. అంతకుముందు జూన్ 4వ తేదీ 2024లో మార్కెట్ 5.74% పడిపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్ పరిస్థితి కూడా అలానే ఉంది.
కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్స్ అంటే 30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్‌సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.