/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-8-8-jpg.webp)
Coimbatore : ఓ మహిళకు లంచం(Bribe) ఇస్తూ బీజేపీ(BJP) నాయకుడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై తనకు హారతి ఇచ్చిన ఓ మహిళకు డబ్బులు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
We have taken cognisance of the video shared. This is forwarded to the police team for verification. The enquiry is in progress. https://t.co/Pqf0AT3jUD
— District Collector, Coimbatore (@CollectorCbe) March 29, 2024
Also Read : ”నో ఎగ్జిట్ పోల్”.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!
సుడిగాలి ప్రచారంలో..
తమిళనాడు(Tamilnadu) బీజేపీ నేత అన్నామలై(Annamalai) ని కోయంబత్తూరు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ఇటీవల ప్రకటించింది. ఇటీవలే తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడానికి వచ్చానని, ఢిల్లీ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని అన్నామలై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో అభ్యర్థిగా పేరు ప్రకటించిన రోజు నుంచి అన్నామలై సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ఒక్క రూపాయి ఇవ్వనంటూనే..
అయితే అలాగే కోయంబత్తూరులో తనను ఓడించేందుకు చాలా మంది డీఎంకే మంత్రులు ఇక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయినా ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా విజయం సాధిస్తున్నారని అన్నామలై ఇటీవల సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో ఇవాళ అన్నామలై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం ఓ ఇంటికి వెళుతుండగా అక్కడి మహిళ అన్నామలైకి హారతి పట్టింది. అప్పుడు అన్నామలై ఆ అమ్మాయి చేతిలో ఏదో పెట్టినట్లు వీడియోలో రికార్డవగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విచారణ కొసాగుతోంది..
ఇక దీనిపై స్పందించిన ఈసీ(EC).. ‘మాకు షేర్ చేసిన వీడియోను గుర్తించాం. ధృవీకరణ కోసం పోలీసు బృందానికి పంపించారం. విచారణ కొసాగుతోంది’ అని తెలిపారు.