Viral Video: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో పలువురు గ్రామస్థులు చిరుతపులితో సెల్ఫీలు దిగిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆరోగ్యం బాగోని చిరుతపులి తోక తొక్కుతూ, వీపుపై ఎక్కుతూ కొంతమంది ఇక్లెరా ప్రవర్తించిన తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం చిరుతపులి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. భోపాల్‌లోని వాన్ విహార్‌లో చిరుతపులికి చికిత్స అందిస్తున్నారు.

New Update
Viral Video: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!

Villagers manhandle leopard: మనుషులు విచిత్ర జీవులు... తమకంటే బలహీనులపై ప్రతాపం చూపించడం.. బలవంతులతో తలపడాల్సి వస్తే వెన్ను చూపడం వారి నైజం. ఇది ప్రతిచోటా మనం చూసేదే. గర్జింజే సింహం, పులి ఎదురైతే ఎవరైనా లగెత్తాల్సిందే. ఎక్కడో కొంతమంది మాత్రమే వాటిని హ్యాండిల్‌ చేయగలరు.. అది కూడా మైండ్‌తో బలంతో కాదు.. కేవలం సినిమాల్లో మాత్రమే క్రూర జంతువులతో మనుషులు తలపడగలరు.. అవి కూడా గ్రాఫిక్స్‌ అనుకోండి..అది వేరే విషయం.. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌(Madya pradesh)లోని ఇక్లెరా గ్రామంలో జరిగిన ఓ ఘటన చూస్తే మనుషులపై చిరాకు వేయకమానదు. ఇది జంతు ప్రేమికులకు మరింత కోపం తెప్పించే ఘటన.. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.


చిరుతతో ఆటలు:
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా ఇక్లెరా సమీపంలోని అడవిలో చిరుతపులి(Leopard) సంచరిస్తూ కనిపించింది. దాన్ని చూసి కొంతమంది గ్రామస్తులు మొదట భయపడ్డా, చిరుత దూకుడుగా ఉండక నీరసంగా ఉండడం చూసి.. అది అస్వస్థతకు గురైందని అర్థం చేసుకున్నారు. అది వెంటపడి తరిమి పిక్కు తిని చంపేసే స్టేజీలో లేదని నిర్ధారించుకున్నారు. ఇంకేముంది.. వెకిలితనం బయటకు వచ్చింది.. చిరుతపులి దగ్గరకు వెళ్లారు.. దానికి చిరాకు తెప్పించారు. రోగంతో ఉంది కదా ఏం చేసినా ఏం కాదులే అని రెచ్చిపోయారు. దాదాపు 12మంది చిరుతపులిని చుట్టుముట్టారు. దాన్ని వీపుపైకి ఎక్కి హింసపెట్టారు. ఒక వ్యక్తి దానిని తొక్కడానికి ప్రయత్నించాడు. మరికొందరు సెల్ఫీలు దిగారు.. దాన్ని ఫొటోలు తీశారు.


కనీసం ఫోన్‌ కూడా చేయలేదు:
చిరుతపులికి ఆరోగ్య సమస్య ఉందని అక్కడి గ్రామస్తులకు తెలియనది కాదు.. దాన్ని చూట్టు చేరిన వారు కనీసం అటవీశాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గ్రామంలో ఎవరో పెద్ద మనసు చేసుకొని అధికారులకు మేటర్‌ చేరవేశారు. వెంటనే సీన్‌లోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతపులిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. పశువైద్యుడు జంతువుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం చిరుతపులి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చిరుతపులిని అలాంటి కండిషన్‌లో చూసి కూడా దాన్ని శరీరకంగా, మానసికంగా హింస పెట్టడంపై డాక్టర్‌ మండిపడ్డారు. ఇలానేనా ప్రవర్తించేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుత మైకంలో అడవిలో సంచరిస్తోందని, సరిగ్గా నడవలేని స్థితిలో ఉందన్నారు ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ . ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వారి(జంతువుల) స్థలాన్ని ఆక్రమిస్తున్నాం, ఇప్పుడు వారి గోప్యతను కూడా ఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి" అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిజమే కదా.. అదే చిరుతపులి ఆరోగ్యంగా ఉండి ఉంటే భయపడి పారిపోయేవాళ్లు.. బలహీనంగా ఉన్న టైమ్‌ చూసి శాడిజం చూపించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.. మన పని మనం చేసుకుంటే సరిపోతుంది.. ఇలా ఇతర జీవులను ఏడిపించాల్సిన అవసరం ఏముంది?

ALSO READ: పట్టపగలే చిరుతకు చుక్కలు చూపించిన బబూన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు