konaseema : కోనసీమలో కొత్త దేవుడు.. శనివారమే దర్శనం.. సాక్షాతూ వెంకన్నేనట!
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి - సాయినగర్ శిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. పేద దంపతులను ఒప్పించి, వారికి రూ.90 వేలు ఇచ్చి బిడ్డ కొనుగోలుకు ప్లాన్ వేశారన్నారు.
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. పిల్లలు చూస్తుండగానే బండరాయితో తలపై కొట్టి కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
గండికోట మైనర్ హత్య వెనుక ఓ బడా రాజకీయ నాయకుడి హస్తం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. 14 రోజులు దాటినా పోలీసులు ఇంకా ఈ కేసును చేధించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ జోక్యంతోనే విచారణకు బ్రేక్ పడిందనే అనుమానాలు వస్తున్నాయి.
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో నేషనల్ హైవేపై ఓ మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్లోనే మృతి చెందారు.
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,20,482 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.