/rtv/media/media_files/2024/10/25/7Bod6P6nQLilWLFmMxE3.jpeg)
వైఎస్ కుటుంబంలో షేర్ల బదిలీ గొడవ ఇంకా సాగుతూనే ఉంది. వైఎస్ భార్య విజయమ్మ, షర్మిల ఆ షేర్లు తమవే అంటుంటే...వాటిని తమ నుంచి లాక్కున్నారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్సీఎల్టీలో విచారణ నడుస్తోంది. తాజాగా షేర్ల బదలాయంపుకు సంబంధించి జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులు సమయం కోరడంతో తదుపరి విచారణను ఎన్‌సీఎల్‌టీ ఏప్రిల్ 3కి వాయిదా వేసింది.
సంతకం లేకుండా బదిలీ చేసుకున్నారు..
తన పేరు మీద, వైఎస్ భారతి పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన జాతీయ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం సంతకాలు కూడా లేకుండా బదిలీ చేసేసుకున్నారని తెలిపారు. దీనిలో తన తల్లి విజయమ్మ, షర్మిల, సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రతివాదులుగా రిజిస్టర్ చేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మధ్యంతర పిటిషన్లపైనా కౌంటర్‌లు దాఖలు చేయడానికి వాద, ప్రతివాదులు గడువు కోరడంతో తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేశారు.
అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఇదే విషయానికి సంబంధించి వైఎస్ విజయమ్మ ఎన్సీఎల్టీకు లేఖ రాశారు. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్ లో వాటాలన్ని తన పేరిట బదిలీ అయ్యాయని చెప్పారు. ఇందులో జగన్ కు కానీ, భారతీరెడ్డికి కానీ వాటాల్లేవని చెప్పారు. ఇద్దరూ కలిసి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్‌కు వైఎస్ విజయమ్మ తెలిపారు. సరస్వతీ లిమిటెడ్ తో కానీ, గిఫ్ట్ డీడ్ తో కానీ రష్మిలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. జగన్‌కు, షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించడానికేనన్నారు.