Vizag: లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రిల్స్ చేస్తూ అడ్డంగా బుక్కైన లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇతనిపై పలు సెక్షన్ల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు నాని ని రిమాండ్ కు తరలించారు. 

New Update
Local Boy Nani batting apps case

Local Boy Nani batting apps case Photograph: (Local Boy Nani batting apps case)

ఒక్కరీల్ తో యూట్యూబర్ నాని చరిత్ర మొత్తం బయటపడింది. అతని బెట్టింగ్ యాప్ ల విషయలం వెలుగులోకి వచ్చింది. ఇతనిపై పదుల సంఖ్యలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఐపీఎస్ సజ్జనార్ ట్వీట్స్ తో మొదలైన గందరగోళం చివరకు నాని బాగోతాన్ని బయటపెట్టింది. ఈ ట్వీట్ తో వైజాగ్ సీపీ లోకల్ బాయ్ నాని విషయంలో సీరియస్ అయ్యారు. దాంతో అతని మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ లెక్కలోకి తీసుకున్నారు. చివరకు పలు సెక్షన్ల కింద  సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.  దాని తర్వాత అతనిని అరెస్ట్ చేసి.. నాని ను రిమాండ్ కి తరలించారు. 

Also Read: TS: తెలంగాణలో మరో ఎనిమిది మంది ఐపీఎస్ లు బదిలీ

బెట్టింగ్ యాప్ లపై రీల్స్..

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు విశాఖ పట్నంకి చెందిన నాని. దీంతో లోకల్ బాయ్ నానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియో చేస్తూ యూట్యూబర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని తన వీడియోలతో ఎంతో పాపులర్ అయ్యాడు. సముంద్రంలో చేపలు పడుతూ చేసిన వీడియోలకు వేలల్లో లైక్స్, వ్యూస్ సంపాదించుకుంటున్నాడు. ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తనకున్న ఫాలోయింగ్‌ను నాని సొమ్ముచేసుకునేందుకు ఇటీవల కొన్ని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే చాలా మంది ఈ విషయంలో అతడిపై మండిపడ్డారు. ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మళ్లీ వాటినే ప్రమోట్ చేయడం ఏంటని చాలా మంది మండిపడ్డారు. దీనిపై ఐపీఎస్ సజ్జనార్ సైతం ఫైర్ అయ్యారు. 

Also Read: HYD: సారీ అమ్మా, చనిపోతున్నా..ఉప్పల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

 

Advertisment
Advertisment
Advertisment