/rtv/media/media_files/2025/03/02/gh1Dcuin5zm1vY8CAZVH.jpg)
Gang selling arrested Photograph: (Gang selling arrested)
విజయవాడలోని ప్రకాశ్‌నగర్ కాలనీలో పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు ఆంధ్రా పోలీసులు. నార్త్ ఇండియా నుంచి పసిపిల్లల్ని తీసువచ్చి తెలుగు రాష్ట్రాల్లో వారికి విక్రయిస్తున్నారు. ఈ దందాలో కీలక నిందితురాలిగా బలగం సరోజిని (21) ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి పిల్లల్ని సరోజినికి విక్రయించేవారు. ఆమె రూ.50 వేల నుంచి లక్ష వరకూ లాభం చూసుకొని తెలుగు రాష్ట్రాల్లో వారికి అమ్ముతుండేది. బాబునే రూ.5 లక్షలకు, పాపను రూ.3 లక్షలకు విక్రయించేది.
Also read : AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్
సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు విజయలక్ష్మీ అనే మహిళ నుంచి ఎగ్ డొనేట్ చేసి డబ్బులు తీసుకునేది. అలాగే మరికొందరు మహిళలతో కూడా ఇలాగే చేయించి కమీషన్ తీసుకునేది బలగం సరోజని. ప్రకాశ్‌నగర్‌లో జరిపిన టాస్క్‌పోర్స్ పోలీసుల దాడుల్లో ఆమె పట్టుబడింది. భవానీపురం కబేళా ప్రాంతానికి చెందిన సరోజినితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
VIDEO | An inter-state infant trafficking racket operating in Telangana and Andhra Pradesh was busted on Tuesday, with the arrest of 11 people, including three childless couples who had purchased babies. Police rescued four infants from Gujarat.
— Press Trust of India (@PTI_News) February 25, 2025
Acting on a tip-off, police… pic.twitter.com/MK62j2YhLb
సరోజినిపై తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో 2024 మే 22న కేసు ఫైల్ అయ్యింది. ఆ కేసులో ఆమె బెయిల్ పై ఆగస్ట్‌లో బయటకు వచ్చింది. ఆమె గత తొమ్మిది నెలలుగా 26 మంది పసి పిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు విచారణలో తెలిసింది.
Also Read : చర్చ్ ముందే నలుగురు మృతి.. హైటెన్షన్ వైర్లకు తగిలి మలమల మాడిపోయారు