Harassment :  స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్‌..ఆపై కోరిక తీర్చాలంటూ...

తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Harassment Of Women

Harassment Of Women

 Harassment : సభ్య సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా కామంధుల తీరు మారటం లేదు.  ప్రతీరోజు ఏదో ఒక చోట కామంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.  చిన్నా,పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరినీ లైంగికంగా వేధిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో  ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: ఈ విత్తనాలు తీసుకుంటే బరువు తగ్గుతారు.. జుట్టుకు కూడా ప్రయోజనం
 
జిల్లాలోని పిరా రామచంద్రపురం గ్రామానికి చెందిన ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ స్నానం చేస్తున్న సమయంలో నల్లమిల్లి మణికంఠ రెడ్డి, కర్రీ రామకృష్ణారెడ్డిలు రహస్యంగా వీడియోలు తీశారు. ఆ తరువాత ఆ వీడియోలను మహిళకు చూపించి వేధింపులు మొదలు పెట్టారు. స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియో బయటకు రాకుండా ఉండాలంటే తమ కోరిక తీర్చాలంటూ మహిళను బ్లాక్ మెయిల్ చేశారు. ఎవరికైనా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదించారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. తన సమస్య ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలి పోయింది.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్‌లో కారు బీభత్సం.. ఇద్దరు స్పాట్ డెడ్!

 అయినా వారి వేధింపులు ఆగలేదు. చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఇద్దరిపై అనపర్తి పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన నిందితులు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా నిందితులను పట్టుకుని వీడియోలు డిలీట్ చేయాలంటూ బాధితురాలు పోలీసులను వేడుకుంది.  

Also Read :  ప్రముఖ సింగర్‌ సోనూ నిగ‌మ్‌ పై  రాళ్లు, సీసాల‌తో దాడి..!

Also Read :  కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment