/rtv/media/media_files/2025/03/12/2zpfuMOaCdlp8f6yyyuI.jpg)
two private bus road accident in annamayya district
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. మరెందరో నిరాశ్రయులవుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు సైతం చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు.
తాజాగా అలాంటిదే అన్నమయ్య జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె సమీపంలోని రాయల్పాడు (కర్ణాటక)లో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతిచెందారు.
మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇంకో 40 మందికి తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అదే సమయంలో చికిత్స పొందిన అనంతరం గాయపడిన వారిలో 25 మందిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పింపించేశారు.