TTD:  టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..?

 తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ధ ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశంతో బ్రేక్‌ దర్శనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanams

TTD:   తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ధ ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకునేందుకు ఉప క్రమించింది.  సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశంతో బ్రేక్‌ దర్శనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాక సిఫారసు (రికమెండేషన్‌) లేఖల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మరో మూడు నెలల వరకు సిఫారసు లేఖలు ఆమోదించడం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read:  Devara Japan Collections: జపాన్​లో దేవర 'ఫెయిల్'..!! అందరి ముందు పరువు పోయిందిగా..
 
 రద్ధీ ఎక్కువగా ఉండడంతో టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. ఇక ఎస్‌ఎస్‌డీ దర్శనానికి సుమారు 6 గంటలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ప్రతీ ఏటా వేసవి రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలను కుదించేలా నిర్ణయం వెల్లడించేందుకు సిద్దమైంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు సిఫారసు లేఖలు తగ్గించి సామాన్యులకు ప్రాధాన్యం కల్పించడం కొంతకాలంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఐదు వేలు, శ్రీవాణి 1500, దాతలు, వర్చువల్‌ ఎస్‌ఈడీల దర్శనాలు దాదాపు మరో ఐదు వేల వరకు టికెట్లను ఇస్తున్నారు. 

Also Read:  Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

ఈ సమయంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయానికి సిద్దమైంది. ప్రస్తుతం బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో.. ఏప్రిల్‌ మొదటి వారం నుండి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారులు, చిన్న చిన్న ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ అంశంపైన టీటీడీ ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకేసారి రద్దు చేయకుండా ముందస్తు సమాచారంతో నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు. శనివారం శ్రీవారిని 76 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.  22 వేల 7 వందల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు