/rtv/media/media_files/2025/04/06/3XZpbyMQjZFjmH6st80I.jpg)
Krishna River Tragedy
Krishna River : శ్రీరామ నవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండగ సందర్భంగా మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15).. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ముగ్గురు బాలురు కూడా ఆలా ఈతకొడుతూ లోతును గమనించకుండా ముందుకు వెళ్లారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
బాలురు స్నానానికి వెళ్లిన సమయంలో అయితే వారితోపాటు పెద్దలెవ్వరూ లేకపోవడంతో వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లి మునిగిపోయారు. ముగ్గురికీ కూడా పూర్తిగా ఈత రాకపోవడం, లోతు మీదా అవగాహనలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయిదాటి పోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
కాగా, అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ కుమారులు నదిలో పడిపోడవంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు గల్లంతు కావడంతో మోదుముడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!