Road Accident : పల్నాడు జిల్లాలో బోల్తా పడ్డ ట్రాక్టర్‌, నలుగురు మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం  సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు.

New Update
Road Accident

Road Accident

Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం  సంభవించింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 25 మంది మహిళా మిర్చి కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఆదివారం ఉదయం వెళ్లారు. ఎప్పటిలాగానే రోజంతా పని చేసిన కూలీలు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు.ఈ క్రమంలో ట్రాక్టర్ కొద్ది దూరం ప్రయాణించాక ముప్పాళ్ళ మండలం బోల్లవరం దగ్గర అదుపు తప్పి బోల్తాపడింది.

Also Read: Delhi Elections: ఓటమి...గెలుపు...రెండిటికీ ఆయనే కారణం


ఈ ప్రమాదంలో గంగమ్మ ( 55)సామ్రాజ్యం(50) మాధవి(25) ,పద్మ (45) అనే నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

Also Read: ఆప్‌ ఓటమిపై స్పందించిన ధ్రువ్‌ రాఠీ.. బీజేపీపై విమర్శలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan : జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!

జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  

New Update
jagan-si-sudhakar

jagan-si-sudhakar

ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..  ‘జగన్‌.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? అని ప్రశ్నించారు.  కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని చెప్పుకొచ్చారు.

ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు

మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతామన్న సుధాకర్..   నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కమని తెలిపారు.  జగన్.. జాగ్రత్తగా మాట్లాడాలి.. జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సుధాకర్‌ హెచ్చరించారు. ఇక  గతనెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు.  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు.

మాజీ సీఎం జగన్ అనుచరులు..  తమ దగ్గర గన్ లు ఉన్నాయని.. ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొడుతున్నారని.. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్..ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

Advertisment
Advertisment
Advertisment