Tirumala Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. TTD చైర్మన్ సంచలన వీడియో!

తిరుమలలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు అన్నారు. ఆడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతుల వల్లనే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆన్నారు.

New Update
BR

B.R.Naidu, TTD Chairman

తిరుమల ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అన్నారు. దీన్నొక యాక్సిడెంట్‌గా తీసుకోవాలని...జరిగినదానికి ఎవరూ ఏమీ చేయలేరని...ఇక ముందు ఏం జరగాలోదాని గురించి ఆలోచించాలని చెప్పారు.

సోషల్ మీడియా వల్లనే..

ఇదంతా సోషల్ మీడియాలో దర్శనాలు ఉండు అనే రూమర్స్ వ్యాప్తి చెందడం వల్లనే అయిందని విచారం వ్యక్తం చేశారు. తాను అలెర్ట్‌గానే ఉన్నానని...ఈరోజు ఉదయం కూడా మీడయా సమావేశంలో కూడా వదంతలును నమ్మొద్దని చెప్పానని చెప్పారు. తాను పోలీస్ కమిషనర్‌‌తో కూడా మాట్లాడానని...5 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నట్టు ఆయన చెప్పారని బీఆర్ నాయుడు తెలిపారు. 

25 మంది దాకా..

రుయా, సిమ్స్ ఆసుపత్రుల్లో  25 మంది దాకా గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. అక్కడ పరిస్థితి కొంత ఉద్రితంగా ఉదని ఆయన అన్నారు.  రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వస్తున్నారని...ఆయన వచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

Also Read: TML: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఉచితంగానే..!

తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వేసవిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు

New Update
ttd

తిరుమల స్వామి వారి భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ యూట్యూబ్ ద్వారా అందించాలని టీటీడీ ఈవో జె శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో ఈవో, వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. 

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇప్పటికే  అన్నమయ్య సంకీర్తనలను ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నిపుణుల‌తో క‌మిటీని ఏర్పాటు చేసి, వారి సలహాలు, సూచనలతో వేగ‌వంతంగా సంకీర్తనల‌ను యూట్యూబ్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల‌లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను స‌కాలంలో పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

అలాగే  వేస‌వి సంద‌ర్భంగా తిరుమలలో టీటీడీ స్థానిక ఆలయాల‌కు వచ్చే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లగ‌కుండా,  ర‌ద్ధీ నేప‌థ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జేఈవో కు ప‌లు సూచనలు చేశారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్ట్‌లలో జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులతో ఆయ‌న‌ చర్చించారు. 

అనంత‌రం తిరుప‌తిలోని ఆరోగ్య విభాగం, శ్వేత‌, టీటీడీ కొనుగోళ్ల విభాగం, స్విమ్స్‌, విద్యా, వైద్యం, తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో వేద‌ విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి, ఎఫ్ ఎ అండ్ సిఎవో బాలాజి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

Also Read: Hyderabad Metro: వివాదంలో  హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం

 tirumala | youtube | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | ttd | eo | ttd-jeo | ap-news | tirumala-news

 

Advertisment
Advertisment
Advertisment