టీటీడీ భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు కుదింపు

సామాన్య భక్తులకు వేసవిలో ఇబ్బంది ఉండకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రేక్‌ దర్శనాలను కుదించేందుకు ప్లాన్ చేస్తోంది. బ్రేక్‌ దర్శనం సమయాన్ని తగ్గించడం లేదా రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇదే జరిగితే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు.

New Update
Tirumala

Tirumala

వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాలను కుదించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది. ఏపీతో పాటు ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపైనా కూడా టీటీడీ వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు కేటాయిస్తుంది. శుక్ర, శనివారాల మినహా మిగిలిన అన్ని రోజులకు కూడా టీటీడీ ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను జారీ చేస్తుంది.

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

మధ్యాహ్నం వరకు బ్రేక్ దర్శనాలు..

దీంతో పాటు సీఎంవోలు, కేంద్రమంత్రులు, టీటీడీ బోర్డు, శ్రీవాణిట్రస్టు, న్యాయశాఖ, పోలీసు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రెస్‌, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ ఇలా వివిధ విభాగాలు, అధికారుల సిఫార్సులపై, స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు బ్రేక్‌ దర్శనాలు ఇస్తున్నాయి. ఉదయం స్టార్ట్ అయిన ఈ బ్రేక్ దర్శనాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

కొంతమంది టీటీడీపై ఒత్తిడి చేసి అదనపు కోటాలో కూడా టికెట్లు పొందుతున్నారు. ఇదే పరిస్థితి వేసవిలోనూ కొనసాగితే సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని భావించి.. బ్రేక్‌ దర్శనాల కుదింపుపై టీటీడీ ప్లాన్ చేస్తోంది. రానున్న పది రోజుల్లో బ్రేక్‌ దర్శనం సమయాన్ని తగ్గించే అంశంపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

వేసవి సెలవుల్లో ప్రతి రోజు సర్వదర్శనం క్యూ లైన్‌ వెలుపలే ఉండే క్రమంలో సిఫార్సుపై లేఖలపై ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయనున్నారు. కేవలం ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

New Update
Rains

ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 'శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.  ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. చెట్ల క్రింద నిలబడద్దొని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

గురువారం మూడు గంటలు నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో వర్షంతో పాటుగా పిడుగులు పడ్డాయి. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 68.9మిమీ, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిమీ, ఎర్రగొండపాలెంలో 62 మిమీ అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. 18 ప్రాంతాల్లో 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది' అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Also Read: Rahul Gandhi: ట్రంప్‌ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి: రాహుల్ గాంధీ

తెలంగాణలో కూడా భారీ వర్షం పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం పడింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా తెలిపింది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని.. 7, 8 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని.. ఆ తరువాత మళ్లీ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: Trump tariffs: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ap | ap-rains | ap rains latest news | ap rains latest update | ap rains latest updates | ap rains today | ap rains update | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | latest telugu news updates | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment