Nara Lokesh: ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం కనబడకూడదు,పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. జూన్‌ 30 నుంచి మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ తీసుకొస్తామని, ఏఐ ఆధారిత సేవలు అందిస్తామన్నారు.

New Update
nara lokesh..

nara lokesh

Nara Lokesh: ‘ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. జూన్‌ 30 నుంచి మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్‌ సేవలు అందిస్తామని లోకేశ్‌ వెల్లడించారు. శాసనసభలో ‘వాట్సప్‌ గవర్నెన్స్‌’పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం 200 సేవలు అందుతున్నాయి. మార్చి నెలాఖరుకు 300, జూన్‌ 30కల్లా 500 సేవలు అందిస్తాం. పౌరులు అడిగిన సేవను 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో 1.23 కోట్ల లావాదేవీలు జరగ్గా.. అందులో వాట్సప్‌ ద్వారా చేసినవి 51 లక్షలు. వాట్సప్‌ గవర్నెన్స్‌ ప్రజలకు ఎంతగా చేరువైందో చెప్పేందుకు ఇదే నిదర్శనం అన్నారు.‘ఒకచోట నుంచి మరో చోటకు టికెట్‌ కావాలని నోటితో చెబితే.. టికెట్‌ బుక్‌ చేస్తుంది. నంబర్‌ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుంది. అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయి’ అని వివరించారు. పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే.. వాటిని వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు.  

Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

Nara Lokesh Key Comments

  విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా దీనిద్వారా అందుబాటులోకి తెస్తాం. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తాం. కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఫిజికల్‌ పత్రాల్లాగే ఎలక్ట్రానిక్‌ పత్రాలూ చెల్లుబాటవుతాయి. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ధ్రువీకరణకు వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించే బిల్లు తెస్తాం’ అని లోకేశ్‌ చెప్పారు. ధాన్యం సేకరణలో వాట్సప్‌ సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్‌ సొంత ఆలోచనతో ప్రారంభించారని.. దాన్ని కూడా అనుసంధానిస్తామన్నారు.

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

 ‘గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి నుంచి ఎక్కువ మంది గెలిచినా.. బీసీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అప్పటి ఎమ్మెల్యే అడ్డుపడ్డారు. కులధ్రువీకరణ పత్రం ఇవ్వనీయకుండా వేధించారు. సర్టిఫికెట్‌ కోసం ఎలా వేధిస్తారో అప్పుడే చూశాను. అక్కడ్నుంచే ఈ ఆలోచన మొదలైంది. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని, చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోందని పాదయాత్ర సమయంలోనూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇబ్బందులు తీర్చడానికే వాట్సప్‌ గవర్నెన్స్‌ ప్రారంభించాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్‌ కమిషన్‌!

వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాలని, రెవెన్యూలో బ్లాక్‌చైన్‌ ఆధారిత విధానాలు అమలు చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో లొకేషన్‌ షేరింగ్‌ అవకాశం కూడా ఇందులో ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ కోరారు. వాట్సప్‌ గవర్నెన్స్‌లో గ్రామాల్లో సమస్యలు, పాఠశాలల్లో ఇబ్బందులు చెప్పే విధానం అమలు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్యలున్నందున వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.

Also Read: Sunita Williams: అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే.. సునీతా విలియమ్స్ కంటేముందే ఇద్దరు మహిళలు

కేంద్ర పథకాల సేవలను కూడా దీనిలో అందించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు. తమ నియోజకవర్గంలో ఒకరు రెండేళ్లుగా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రానికి తిరుగుతున్నా మంజూరు చేయలేదని.. వాట్సప్‌ గవర్నెన్స్‌ వచ్చాక వెంటనే వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. ఎచ్చెర్ల,  రాజమహేంద్రవరం నగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, లోకం నాగమాధవి మాట్లాడారు.

Also Read:  Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్‌వేర్ మృతి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!

ఎండల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు. ఈ ప్రభావంతో నిమ్మకాయల ధర పెరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలి, హోల్‌సేల్‌ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి.

New Update
lemon

lemon

Lemon: వేసవికాల ఎండలు భగభగమండుతున్నాయి. ఏప్రిల్ లోనే ఈ రేంజ్ లో ఇలా ఉంటే మేలో ఇంకేలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  సహాజంగా వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయల ధర మోత మోగుతుంది. గత నెలలో క్వింటా రూ. 6 వేల ఉన్న ధర ప్రస్తుతం 12 వేలకు పెరిగింది. ఎండలు, వడగాల్పులు పెరిగే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలోని ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలిహోల్‌సేల్‌ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి. 

పెరుగుతున్న ధరలు:

ప్రస్తుతం ఏపీలో లక్షా 20 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. కాగా వేసవిలో దిగుబడి తగ్గినా.. 4 లక్షల టన్నుల దాకా ఉత్పత్తి వస్తుందని అంటున్నారు వ్యాపారులు. నీటి వసతి ఉన్న తోటలకు ఈ సంవత్సరం కాపు బాగానే ఉంది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో ఒక్కోటి నిమ్మకాయ సైజును బట్టి 4 నుంచి 10 రూపాయాల వరకు అమ్ముతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ టాబ్లెట్ వల్ల గర్భిణీ స్త్రీలకు అలసట...ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!

ఎండాకాలం సీజన్‌ ప్రారంభంలోనే నిమ్మకాయల ధరలు చూసి ప్రజలు భయ పడుతున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ కూరగాయల మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రూ.100లకు విక్రయించారు. అందులో ఒక్కో నిమ్మకాయ సైజ్‌ను బట్టి రూ.5 నుంచి 10 అమ్మారు. అయితే ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ధర  రూ. 10లపైనే పలుకుతోంది. గత మూడు రోజులుగా కిలో నిమ్మకాయలు రూ. 200లకు విక్రయిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నిమ్మకాయ ధరలు చూసి కోనాలంటేనే భయపడుతున్నారు. అంతేకాకుండా... చిన్నపాటి కాయాలు, రసంలేని కాయలకు కూడా బాగా డిమాండ్ ఉంది. దీంతో వ్యాపారులకు బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది.  

ఇది కూడా చదవండి: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?

Advertisment
Advertisment
Advertisment