విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్.. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్‌గా చాలా హడావిడి చేశాడు. చాలా మంది కింది స్థాయి పోలీస్ అధికారులు సైతం అతడితో ఫొటోలు దిగారు. సూర్య ప్రకాష్ నిజంగానే ఐపీఎస్ అధికారి అనుకుని అతడితో ఫొటోలు, వీడియోలు దిగారు. దాంతో అయితే అను నకిలీ ఐపీఎస్ అని తెలియడంతో తరువాత ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. అనుమానం వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఐపీఎస్ నంటూ చెప్పుకుని తిరుగుతున్న సూర్య ప్రకాష్ బాగోతం బయటపడింది. గతంలో తాను ఇండియన్ ఆర్మీలో పని చేశానని సూర్యప్రకాష్ చెప్పుకుని తిరిగినట్లు తెలిసింది. అలాగే విజయనగరం జిల్లాలో గతంలో తాను ఉన్నతాధికారిగా హల్ చల్ చేసి వ్యాపారస్తులను కూడా భయబ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.
కుట్ర ఏమీ లేదు..
ప్రస్తుతం సూర్యప్రకాశ్‌ను పార్వతీపురం మన్యం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వయసు 41 ఏళ్ళు. ఇతని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సూర్యప్రకాశ్ గురించి అసలు విషాలు తెలిసాయి. దర్యాప్తులో సూర్య ప్రకాష్ తండ్రి దత్తిరాజేరులో 9 ఎకరాల భూమి కొనుగోలు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఆ భూమిని సొంతం చేసుకునేందుకు పోలీసు అధికారిగా వేషధారణ చేసినట్టు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి కారు, ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సూర్యప్రకాష్ పవన్ కల్యాణ్ పర్యటనలో ఆయన కార్యక్రమం పూర్తయ్యాక మాత్రమే అతను ఫొటోలు దిగాడని, పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇతని వెనుక ఏమీ కుట్ర కోణం ఏమీ లేదని తెలుస్తోందిన పోలీసులు చెబుతున్నారు.