/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
road accident
రోజు రోజుకు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగిపోతుంది. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి.. తమ కుటుంబానికి విషాదాన్ని మిగుల్చుతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు, ఉన్నత అధికారులు సైతం చర్యలు తీసుకుంటున్నారు. కానీ రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.. మృతుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా మరో దారుణమైన ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
స్పాట్‌లో నలుగురు
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఓవర్‌టెక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన జరిగింది. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
కోకాపేట గార్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం
కాగా ఇలాంటిదే మరో విషాదం ఇవాళ చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కోకాపేట గార్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే బిల్టింగ్‌లో ఉన్న రెస్టారెంట్లో సిలిండర్ పేలినట్లు అనుమానం. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగుల ముఖాలు మంటల్లో తీవ్రంగా కాలిపోయాయి.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...