/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/snakes-11-scaled.jpg)
snakes
అతడో దినసరి కూలి ...రోజూ పనికి వెళితే కానీ పూట గడవని సిట్యూవేషన్. కానీ అతను పనికి వెళ్లిన ప్రతిచోటా పగబట్టినట్లుగా పాములు కాటేస్తున్నాయి. ఇలా ఒకటి రెండు సందర్భాలు కాదు పదుల సంఖ్యలో పాములు ఆయన్ను కాటేశాయి. ఇలా పాము కరిచిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి రావడం.. మళ్లీ ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ కూలి పనులకు వెళ్తుండడం పరిపాటయ్యింది.
Also Read: AP: వేగంగా ఏపీలో అభివృద్ధి.. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో లులూ మాల్స్
ఇలా ఏటా నాలుగైదు సార్లు పాములు కాటు వేసేవంట.. ఇలా తరచూ పాములు కాటు వేయడంతో సర్పదోష నివారణ.. రాహుకేతు పూజలు, పరిహారాల వంటివి చేసినా సరే పరిస్థితి ఏమాత్రం మారలేదంటున్నారు. వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం వయసు 50 ఏళ్లు.. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం 20 ఏళ్ల వయసులో మొదటిసారి పాము కరిచింంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది. వైద్యం చేయించుకుని బయటపడ్డాడు.
Also Read: Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!
అప్పటి నుంచి ఏటా పాము కాటు తప్పడం లేదు. ఇలా పనికి వెళ్లిన చోట కూడా పాముల బెడద తప్పడం లేదు.. దీంతో పదేళ్ల క్రితం పాముల దెబ్బకు భయపడి బెంగళూరు వెళ్లిపోయాడు. అక్కడ భవన నిర్మాణ, మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అక్కడ కూడా సుబ్రహ్మణ్యాన్ని పాములు వెంటాడాయి. అక్కడ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకుని బతికిబట్టకట్టారు. పాముల దెబ్బకు మళ్లీ బెంగళూరును వదిలేసి భయాందోళనలతో మళ్లీ సొంత ఊరికి వచ్చేశాడు.
అక్కడ స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలో పనులు చేసుకుంటున్నాడు.. సుబ్రహ్మణ్యం అప్పుడప్పుడూ పొలం పనులకూ వెళ్తున్నారు. రెండు రోజుల క్రితం ఊరిలో పనులు చేస్తుండగా అతడ్ని పాము కరిచింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇలా తనను తరచూ పాములు కరుస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. పాము కాటు నుంచి కోలుకున్న తర్వాత కూలి పనులు చేసి అప్పులు తీర్చడం భారంగా మారిందన్నారు సుబ్రహ్మణ్యం, అతడి భార్య శారదమ్మ.
Also Read: Israel: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..200 మంది మృతి
Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!