YS Vijaymma: జగన్ కు విజయమ్మ మరో బిగ్ షాక్.. 'సరస్వతి పవర్'పై సంచలన లేఖ!

సరస్వతి పవర్ కార్పోరేషన్ లో వాటాలన్నీ తనవే అంటున్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ. జగన్, భారతిరెడ్డిలు ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఎన్ఎల్సీటీ హైదరాబాద్ బెంచ్ కు తెలిపారు. 

New Update
ap

Jagan, Sharmila, Ys Vijayamma

సరస్వతి పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పవర్ లో వాటాలన్ని తన పేరిట బదిలీ అయ్యాయని చెప్పారు. ఇందులో జగన్ కు కానీ, భారతీరెడ్డికి కానీ వాటాల్లేవని చెప్పారు. ఇద్దరూ కలిసి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌కు వైఎస్‌ విజయమ్మ తెలిపారు. సరస్వతీ లిమిటెడ్ తో కానీ, గిఫ్ట్ డీడ్ తో కానీ రష్మిలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.  జగన్‌కు, షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించడానికేనన్నారు. 

నిస్సహాయంగా కోర్టులో నిలబెట్టారు..

జగన్, షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు. సరస్వతి వాటాలపై హక్కులన్నీ తనవేనని స్పష్టం చేశారు. పిల్లల మధ్య వివాదంలో ఏ తల్లీ కోరుకోని విధంగా తాను కోర్టులో నిలబడాల్సి వచ్చిందని...ఇలాంటి నిస్సహాయ స్థితి ఎవరికీ రాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితోనైనా దీన్ని వదిలేస్తే బావుంటుందని అన్నారు. సరస్వతి వాటాల కొనుగోలు, గిఫ్ట్‌డీడ్‌ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారం తన పేరిట బదలాయించారని విజయమ్మ చెప్పారు.  షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్‌డీడ్‌ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చాననడం అబద్ధమని చెప్పారు.  దీనిపై జగన్, భారతిరెడ్డి, క్లాసిక్‌ రియాల్టీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావని, భారీ జరిమానాతో కొట్టేయాలని విజయమ్మ కోరారు.

వ్యక్తిగత, రాజకీయ వివాదాలు...

వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో పటిషన్ దాఖలు చేశారని విజయమ్మ అన్నారు. దీనిలో సెక్షన్ 59ను తప్పుగా అన్వయిస్తున్నారని చెప్పారు. జగన్, భారతీలకు సరస్వతి పవర్ లో ఉన్న వాటాలన్నీ తన పేరు బదిలీ అయిపోయాయని...ప్రస్తుతం వారికి ఏమీ లేవని తెలిపారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపవని చెప్పారు. గిఫ్ట్‌డీడ్‌లో షర్మిల ప్రయోజనాల కోసం అంటూ ఎలాంటి షరతులు లేవని, అవాస్తవాలతో ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సరస్వతిలోని 46.71 లక్షల వాటాలను సండూర్‌ కంపెనీ, 71.50 లక్షల వాటాలను క్లాసిక్‌ రియాల్టీ తనకు విక్రయించిందని..దీంతో మొత్తం 1.21 కోట్ల ఈక్విటీ వాటాలతో 48.99% తాను దక్కించుకున్నానన్నారు. 2021 జులై 26న జగన్, భారతి రెండు గిఫ్ట్‌డీడ్‌ తనకు చేసి ఇచ్చారన్నారు. వీటి ప్రకారం సరస్వతిలో జగన్‌కు చెందిన 74.26లక్షల వాటాలు, భారతికి చెందిన 40.50 లక్షల వాటాలను తనకు బదిలీచేసినట్లు తెలిపారు. దీనిని జూలై 2న బోర్డు సమావేశంలో ఉంచగా అందులో డైరెక్టర్లుఅందరూ బదలాయింపుకు ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. దీంతో కంపెనీ సభ్యుల జాబితాలో తన పేరు నమోదయిందని చెప్పారు.ప్రస్తుతం తాను సరస్వతి పవర్ కంపెనీలో 99.75 శాతం వాట పొందానని చెప్పారు. 

Also Read: Business: భారీ నష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ.. జగన్, పవన్ లపై హర్షకుమార్ సంచలన కామెంట్స్!

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు. 

New Update
jagan-and-harsha-kumar

jagan-and-harsha-kumar

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.  ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించలేదని.. డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదేనన్నారు. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

ముమ్మాటికీ హత్యే

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలది ముమ్మాటికీ హత్యేనని..  న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానని హర్షకుమార్ వెల్లడించారు. ఇందుకోసం  2025 శనివారం 19వ తేదీన గుడ్ ఫ్రైడే  రోజున సాయంత్రం 4 గంటల నుండి 6.30 గంటల వరకు ఎవరికి వారు వచ్చి ప్రవీణ్ దేహం ఎక్కడ దొరికిందో కొవ్వూరు దివాన్ చెరువు రోడ్ లో నయార పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న స్థలంలో ఎవరికి వారు ఒక కొవ్వొత్తు తెచ్చుకొని అక్కడ వెలిగించి వెళ్ళండని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రవీణ్ ను  ప్రభుత్వమే హత్య చేయించిందని నమ్మే ప్రతి ఒక్కరు రావలన్నారు హర్షకుమార్. అలాగే ఈస్టర్ ఆదివారం ఆంధ్రా, తెలంగాణలో ఉన్న ప్రతి సమాదుల దొడ్డి దగ్గర ప్రవీణ్ ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలన్నారు. మన నిరసనను కూడా చాలా శాంతి పంథంలో తెలుపుదామని.. తనకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని హర్షకుమార్ వీడియోలో కోరారు.  

ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ప్రభుత్వం ఇప్పటి దాకా స్పందించలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించలేదు....

Posted by GV Harsha Kumar on Wednesday, April 16, 2025

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

Advertisment
Advertisment
Advertisment