Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్‌ అదిరిందిగా..!

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో పింఛన్లు పంపిణీ చేయాల్సిన డబ్బులతో సచివాలయ ఉద్యోగి మాయం అయ్యారు. అంతేకాకుండా ఆ నగదుకు సంబంధించి సినిమా లెవల్లో ఓ కథ అల్లి పోలీసులకు వివరించాడు.కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

Prakasam:ప్రకాశం జిల్లాలో ఓ వార్డు సచివాలయ ఉద్యోగి సినిమా రేంజ్‌లో డ్రామా ఆడి అందర్ని నమ్మించాలని చూశాడు. ఎవరోపింఛన్ డబ్బుల్ని ఎత్తుకెళ్లి దోపిడీ జరిగినట్లు స్టోరీ చెప్పాడు.. కానీ పోలీసులు మనోడి ప్లాన్‌ను కనిపెట్టేసి అసలు దొంగ అంతు చూశారు. మార్కాపురంలో వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి.. గత నెల 31న పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రూ.2.66 లక్షల డబ్బుల్ని తీసుకుని పారిపోయాడు.

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

 వెంటనే అడ్మిన్‌ సెక్రటరీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలించగా చివరికి ఆచూకీ దొరికింది.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఉద్యోగి పింఛన్‌కు సంబంధించి రూ.2.50 లక్షలు ఆన్‌లైన్‌లో యాప్‌ల్లో బెట్టింగ్‌ పెడితే ఫిబ్రవరి 1న పింఛన్ల పంపిణీ సమాయానికి రూ.10 లక్షలు అవుతుందని ఆశపడినట్లు తెలుస్తుంది. అయితే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

 ఈ విషయం బంధువులకు తెలియడంతో.. వారు ఆ డబ్బుల్ని చెల్లించడంతో.. లబ్ధిదారులకు పింఛన్‌ నగదు అందజేశారు. ఆ వెంటనే ఆ ఉద్యోగిని పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. డబ్బుల ఆశతోనే ఇలా చేసినట్లు సమాచారం.. యువత ఇలా బెట్టింగ్స్ మాయలో పడొద్దని చెబుతున్నారు పోలీసులు.

ఇదిలా ఉంటే దొనకొండ దగ్గర బాదాపురం సమీపంలో కూడా మరో సచివాలయ ఉద్యోగిని కొందరు దుండగులు అడ్డుకుని సినిమా స్టైల్‌లో డబ్బుల్ని చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. దొనకొండ మండలం చందవరంనకు చెందిన వీరంరెడ్డి రంగారెడ్డి పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఊరి పంచాయతీ పరిధిలోని 58 మంది పింఛన్‌దారులకు సంబంధించిన రూ.2.68 లక్షల డబ్బుల్ని తీసుకుని సొంతూరు చందవరానికి వెళ్లారు. 

శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి పింఛన్‌ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు చందవరం నుంచి తన బైక్‌పై దొనకొండకు బయల్దేరారు.ఈ క్రమంలో మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు మొహం కనపడకుండా కర్చీఫ్‌లు కట్టుకుని రంగారెడ్డిని బైక్‌పై వెంబడించినట్లు చెబుతున్నారు. బాదాపురం సమీపంలో రంగారెడ్డిని అడ్డగించి.. బైక్‌పై నుంచి కిందకు నెట్టేసి డబ్బులు ఉన్న బ్యాగును లాక్కొని బైక్ ‌పై చందవరం వైపు వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే రంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. త్రిపురాంతకం పోలీసులు వెంనటే సంఘటనా స్థలానికి చేరుకొని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రంగారెడ్డితో మాట్లాడారు. 

ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి దొంగల కోసం గాలించారు.. కానీ ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

Also Read: Gongadi Trisha: టీ-20 మ్యాచ్ మ్యాచ్ గెలిపించిన గొంగడి త్రిష.. సీఎం రేవంత్ ఏమన్నారంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Kiss Video: ఛీ ఛీ.. లైవ్‌లో ముద్దులతో రెచ్చిపోయిన అఘోరీ-శ్రీవర్షిణి.. కారులో రచ్చ రచ్చ

అఘోరీ - శ్రీవర్షిణి కారులో రెచ్చిపోయారు. లైవ్‌లో ఉండగానే ముద్దులతో రచ్చ రచ్చ చేశారు. వర్షిణి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెవల్ల తన లైఫ్ టర్న్ అయిపోయిందని అఘోరీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వర్షిణి బుగ్గపై ముద్దు పెడుతూ ఐలవ్ యు చెప్పింది.

New Update

అఘోరీ-శ్రీవర్షిణి తమ కార్‌లో ముద్దులతో రెచ్చిపోయారు. వర్షిణి తనకు దొరికిన మేలిమి బంగారమని తెగ పొగేడిసింది అఘోరీ. ఈ మేరకు వర్షిణిని పొగుడుతూ ముద్దులతో రచ్చ రచ్చ చేసింది. ‘‘వర్షిణి చాలా మంచిది. తను నాకు దొరికిన వజ్రం. నా లైఫ్ ఆమె వల్ల ఫుల్ టర్న్ అయిపోయింది. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

సభ్యసమాజం ఎలా ఉంటుంది.. ఎలా మాట్లాడతారు అనేది మొత్తం నేర్పించింది వర్షిణి. అందువల్లనే జీవితంలో వర్షిణి నేను ఇలాగే హ్యాపీగా ఉంటాం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. లవ్ యు చిన్నూ. జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాం. ఎవరెన్ని మాట్లాలు అన్నా.. ఎవరెంత బురద చల్లినా.. నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగానే ఉందాం.’’ అంటూ వర్షిణి బుగ్గపై ముద్దు పెట్టి రచ్చ రచ్చ చేసింది.

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

ముద్దులతో రచ్చ రచ్చ

దానిపై వర్షిణి కూడా నవ్వుతూ థాంక్యూ అంటూ చెప్పడం చూడవచ్చు. అంతేకాకుండా వర్షిణి తనను బావా అని పిలుస్తుంది అని అఘోరీ చెప్పుకొచ్చింది.  ఆశ్రమం కట్టడానికి ప్రయత్నిస్తున్నామని.. అది పూర్తయ్యాక త్వరలో తమ పేరెంట్స్, వర్షిణీ పెరెంట్స్‌ను తీసుకుని వెళ్లిపోతామని తెలిపారు.

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

తమ ఆశ్రమంలో అన్ని సమస్యలు ఎదుర్కొన్న వారికి చోటు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకునే వారికి చోటు కల్పిస్తామని అన్నారు. ఏది ఏమైనా అఘోరీ, శ్రీవర్షిణి ముద్దులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

aghori sri varshini | Aghori Sri Varshini Lov | sri varshini | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment