AP:  న్యూ ఇయర్‌ కిక్కు.. వామ్మో ఒక్కరోజులోనే అంత తాగారా?

ఏపీలో డిసెంబర్‌ 31 ఒక్కరోజునే మందుబాబులు రూ. 200 కోట్ల మద్యాన్నితాగారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు.దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది.

New Update
liquor

Ap: ఏపీలో న్యూ ఇయర్ కిక్కు బాగా కనిపించింది.. 2024కు ఘనంగా వీడ్కోలు చెబుతూ 2025కు స్వాగతం పలుకుతూ పార్టీలు గట్టిగానే చేసుకున్నట్లు కనపడుతుంది. డిసెంబరు 31వ తేదీ ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు దాదాపు రూ.200 కోట్ల విలువైన మద్యాన్ని గుటాకాయ స్వాహా చేశారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు.

Also Read: Tirumala: తిరుమలలో కియోస్క్ మెషిన్‌ ప్రారంభం.. డబ్బులు లేకపోయినా పర్లేదు

1700కోట్ల విలువైన మద్యం విక్రయాలు..

ఏపీ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లు, క్లబ్బుల్లో మరో 2 గంటలపాటు అదనంగా విక్రయాలకు అనుమతి ఇచ్చింది.దీంతో దొరికిందే ఛాన్స్‌ అని దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చేసింది. దాదాపు 14 గంటల పాటు మద్యం అమ్మకాలు అయితే కనుక.. గంటకు సగటున రూ.14.28 కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు జరిగినట్లు లెక్కలు బయటకు వస్తున్నాయి. గతేడాది రూ.1500కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగితే.. ఈసారి అందుకు అదనంగా మరో రూ.200 కోట్లు కలుపుకొని రూ.1700కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం 7 రోజుల్లోనే జరిగిపోయాయి.

Also Read: Time Travel Flight: రియల్ లైఫ్ టైమ్ ట్రావెలర్.. 2025 నుంచి 2024కు వెళ్లిన విమానం!

రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సరం కోసం మూడు రోజుల ముందే.. అంటే డిసెంబర్ 29నే మద్యం స్టాకును డిపోల నుంచి షాపులకు చేరవేసేశారు. కానీ ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు.. డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.331.85 కోట్ల విలువైన మద్యాన్ని షాపులకు వేశారు. 31వ తేదీ ఒక్కరోజే 2.50 లక్షల ఐఎంఎల్‌ కేసులు, 75 వేల బీరు కేసులు విక్రయం జరిగినట్లు తెలుస్తుంది.

Also Read: Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

దీని విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో మాత్రం రోజుకు రూ.80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి షాపులకు తీసుకెళ్లారు. 

Also Read: CM Revanth: నేను మారాను.. మీరు కూడా మారండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

అయితే కొత్త సంవత్సరం సందర్భంగా అందుకు రెండు రెట్లు అధికంగా స్టాకును తీసుకువెళ్లారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు గట్టిగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎక్సైజ్‌ శాఖ 24గంటల తనిఖీలు చేపట్టారు అధకారులు. దీంతో రాష్ట్రంలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తుంది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల యజమానులకు మార్జిన్‌ను 10శాతం నుంచి 14శాతానికి  పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Alekhya Chitti Pickles New Business: పచ్చళ్ల బిజినెస్ క్లోజ్.. కొత్త వ్యాపారంలోకి అలేఖ్య చిట్టి.. ఈసారి ఏంటంటే?

అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇక నుంచి వారు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. త్వరలో రమ్య పేరుతో లడ్డూ బిజినెస్ ప్రారంభించబోతున్నారని అన్వేష్ తాజాగా చెప్పాడు.

New Update
Alekhya Chitti Pickles going to start a new business..

Alekhya Chitti Pickles going to start a new business

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం మూడు రోజుల నుంచి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీ మరింత ముదిరిన నేపథ్యంలో అక్కా చెల్లెల్లు సుమ, అలేఖ్య, రమ్య వెనక్కి తగ్గారు. ఈ మేరకు అలేఖ్య చేసిన తప్పుకు ముగ్గురూ క్షమాపణలు చెప్పారు. ఈ వివాదంలో ఘోరమైన ట్రోల్స్, విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉంది. అలేఖ్య తీవ్ర అనారోగ్యం బారిన పడిందని.. ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉందని ఆమె సిస్టర్ చెప్పుకొచ్చిన ఆడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక ఈ వివాదం జరగడంతో వారు తమ పచ్చళ్ల బిజినెస్‌ను ఆపేశారు. అయితే ఆ బిజినెస్‌కు బ్రేక్ ఇచ్చి మరొక కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. ఈ మేరకు అలేఖ్య వివాదంపై అతడు స్పందించాడు. అలేఖ్య బూతులు మాట్లాడటం చాలా తప్పేనని అన్నాడు. వారి ముగ్గురిని తాను చెల్లెల్లుగా భావిస్తున్నానని.. దయచేసి వారిని క్షమించండి అని కోరాడు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కొత్త బిజినెస్‌లోకి అలేఖ్య చిట్టి

అంతేకాకుండా ప్రస్తుతం వారి పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా మూతపడిపోయిందని చెప్పుకొచ్చాడు. అందువల్ల త్వరలో వారు మరొక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు.ఇక నుంచి అలేఖ్య పికిల్స్ బిజినెస్ తీసేసి త్వరలో రమ్య పేరుతో లడ్డూ వ్యాపారం చేయబోతున్నారని అన్నాడు. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పూతరేకులు, లడ్డూలు, స్వీట్స్ వంటివి తయారు చేస్తారని తెలిపాడు. రేటు ఎక్కువగా ఉన్నా.. వీళ్లు క్వాలిటీ మెయింటైన్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అందువల్ల వీళ్లని వదిలేయండని.. అయిపోయిందేదో అయిపోయింది.. క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొన్నాడు. దీనిబట్టి చూస్తే ఇకపై అలేఖ్య పేరుతో కాకుండా రమ్య పేరుతో ఈ లడ్డూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news | naa anveshana)

Advertisment
Advertisment
Advertisment