/rtv/media/media_files/2025/03/16/BVGY9QCb4RUDjNQHqpyM.jpg)
Road accident
Road accident : శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్నారు. అనంతరం కుమారుడితో పాటు మరో ఇద్దరితో కలిసి పాతపట్నానికి కారులో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనకు అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు సేఫ్టీ రూల్స్ కచ్చితంగా పాటించాలని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని, నిషేధిత పదార్థాలు తరలించొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!