/rtv/media/media_files/2025/10/08/big-shock-for-mohan-babu-2025-10-08-07-09-32.jpg)
mohan babu
AP High Court : విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసి నిర్భంధించిన విషయంలో సినీనటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు తదుపరి విచారణ జరిపే వరకు మోహన్ బాబుపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మోహన్‌బాబు యూనివర్సిటీలో జరగుతున్న అవకతవకలపై ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను మోహన్‌బాబు కిడ్నాప్ చేయడంతో పాటు నిర్భంధించి బెదిరించాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక కేసుకు సంబంధించిన సీడీని కోర్టు ముందు ఉంచాలని వారికి స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. కాగా వర్సీటీలో యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో దర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని నిర్భంధించి బెదిరించారు. ఈ విషయమై మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బౌన్సర్ల ఆధీనంలో ఉన్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్లతోపాటు వారి వాహనాలను సీజ్ చేసి తిరుపతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హై కోర్టులో విచారణ సాగుతోంది.
Follow Us