/rtv/media/media_files/2025/02/08/v2YDgpOZp48c9k1KCyam.webp)
Pattipati Pullarao vs. Vidadala Rajani
Pattipati Pullarao vs. Vidadala Rajani : వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు. మళ్లీ తాము అధికారంలోకి రాకుండా పోమని అప్పుడు పుల్లారావు నువ్వు ఎక్కడికి పారిపోయినా... నువ్వెక్కడ దాక్కున్న కచ్చితంగా నిన్ను లాక్కు రావటం ఖాయం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పుల్లారావు ఒక అందమైన కట్టు కథ అల్లి తనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడన్నారు.80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్ లో ఉంటున్న మా మరిదిపై అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబం పై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు.పుల్లారావు గుర్తుపెట్టుకో... మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉందని రజనీ గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Results: 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలుపు.. ప్రధాన కారణాలు ఇవే !
పుల్లారావు అక్రమాలు చేస్తున్నారని.. ఎక్కవ కాలం ఇవి కొనసాగించలేరని చెప్పుకొచ్చారు. తన పార్టీ.. తన కుటుంబం జోలికి వస్తే వదిల నని రజనీ హెచ్చరించారు. తన ఏడేళ్ల రాజకీయంతోనే 25 ఏళ్ల పుల్లారావు రాజకీయం తల దించుకునేలా చేసానని రజనీ అన్నారు. తనది పురుషోత్తపట్నం అని గుర్తు చేసిన రజనీ.. పుల్లా రావు ఇదే రకంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. తాను అయిదేళ్లు చిలకలూరి పేట కు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేసానని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ ఇలాంటి అరాచక పాలన ప్రోత్సహించలేదన్నారు. అవినీతి - అక్రమాలు తన కుటుంబ సభ్యులతో పాటుగా వైసీపీ కేడర్ పైన అక్రమ కేసులు పెట్టి.. భయపెట్టాలని చూస్తు న్నారని రజనీ మండిపడ్డారు. ఎవరిని వదిలిపెట్టమని..అందరి సంగతి తెలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడమని.. ప్రతీ కేసు బలంగా ఎదుర్కొంటామని రజనీ చెప్పారు. నియోజకవర్గంలో ఇక తాను మరింత బలంగా పని చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ టాక్స్ లో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని రజనీ పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులను హింసించాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!
తాను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన రజనీ, ఏదో ఒకరోజు పుల్లారావు కి వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు ,అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడివో గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. మా పాలనలో మేము అభివృద్ధి పైన దృష్టి పెడితే మీ ప్రభుత్వంలో నువ్వు అరాచకం పైన దృష్టి పెట్టావన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు... అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలను జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్ గా మారిందని విడదల రజనీ ఆరోపించారు. కాగా గత ఎన్నికల్లో విడదల రజనీకి చిలకలూరిపేట కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. అయితే అక్కడ రజనీ ఓడిపోయారు. కాగా మొన్నటి ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గెలుపొందారు. కాగా ఇటీవల చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా విడదల రజనీని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉత్తర్వూలు జారీ చేశారు. దీంతో నియోజక వర్గంలో ఇద్దరిమధ్య నువ్వా నేనా అనేలా రాజకీయ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి.
Also Read : పార్టీ ఓడినా.. ఆమె గెలిచింది.. AAPకు ఇక పెద్ద దిక్కు అతిషే!