Posani Krishna Murali:  పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత

అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే జైలు అధికారులు ఆయన్ను  రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  

New Update
Posani Krishna Murali

అన్నమయ్య జిల్లా  రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే జైలు అధికారులు సబ్ జైలు నుంచి  ఆయన్ను  రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిచగా.. పోసానిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఛాతి నొప్పితో గతకొంతకాలంగా బాధపడుతున్నారు పోసాని. కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

Also Read :  డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!

జోగినేని మణి  ఫిర్యాదు మేరకు 

కాగా జనసేన నాయకుడు జోగినేని మణి (Jogineni Mani) 2025 ఫిబ్రవరి 24వ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ఫిబ్రవరి26వ తేదీన హైదరాబాద్‌లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి పోసానిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Also read :  HYD Crime: కేపీహెచ్‌బీలో కలకలం.. పూజశ్రీ ఎందుకు చనిపోయింది?

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు 

పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.   కులాలు, వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోసాని వాంగ్మూలంలో తెలిపారు.  సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్ల,  కావాలనే పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టానని పోసాని వెల్లడించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉంటూ వైసీపీకి సపోర్ట్ చేశానని పోసాని పోలీసులకు తెలిపారు.

పవన్‌ (Pawan Kalyan) ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాట్లాడిన మాటలు అన్ని కూడా సజ్జల కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాల్లో వైరల్ చేసేవాడని పోసాని రిమాండ్‌లో వెల్లడించారు. ఈ మేరకు పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్‌ రిపోర్టును పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు. 

Also read :  పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

Also read :  ఐదేళ్లు వాడుకుని మొహం చాటేసిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ఢీ డ్యాన్సర్!

Advertisment
Advertisment
Advertisment