Suicide attempt: రెడ్ శారీ వల్లే వాడి కళ్ళలో పడ్డా’.. శారీరకంగా మోసపోయా..

ఓ ఫంక్షన్‌కు కట్టుకెళ్లిన రెడ్‌ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా' అని డైరీలో రాసి ఫార్మ్‌ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం  చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Pharmacy studentSuicide attempt

Pharmacy student Suicide attempt

Suicide attempt : "ఓ ఫంక్షన్‌కు కట్టుకెళ్లిన రెడ్‌ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా' అని డైరీలో రాసి ఫార్మ్‌ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం  చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆ డైరీలో ప్రస్తావించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితున్ని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

lso Read :  ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని గ్రామానికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో ఫార్మ్‌ బీ ఫైనలియర్ చదువుతోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా యువతి ఓ వైపు చదువుకుంటూనే నగరంలోని ఓ ఆసుపత్రిలో క్లినికల్‌ ఫార్మసిస్టుగా పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. అక్కడే ఆ యువతికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వస్తే అతను అసభ్యకర ఫొటోలు బయటపెడుతా అంటూ బెదిరించాడని ఆ యువతి పేర్కొంది. ఈ క్రమంలో ప్రేమ పేరుతో మోసపోయిన బాధిత యువతి ఆసుపత్రికి వెళ్లి మత్తుమందు తాగి ఆత్మహత్యాయత్ననికి పాల్పడింది.

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

ఈ నేపథ్యంలో బాధిత యువతి సూసైడ్ లేఖలో రాసిన వివరాలు చూస్తే.. ‘‘అమ్మ.. నాన్నా.. నన్ను క్షమించండి. మీకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నా. నా జీవితం నాశనం చేసుకున్న.. ఇక భరించే ఓపిక లేదు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయాను. నా భవిష్యత్తు పై ఎన్నో కలలు కన్నా అన్ని ఆవిరయ్యాయి. నేను ఇంత కష్టపడి చదివిన చదువు నా మరణానికే అన్న సంగతి ఇప్పుడే అర్థమైంది. ఓ ఫంక్షన్‌కి కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లలో పడ్డాను, శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో పుడతా. ఈ రోజుల్లో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నన్ను ఎంత కొట్టినా, తిట్టినా భరించా. ఇక ఏడ్చే ఓపిక, తట్టుకునే శక్తి లేదు. అతను లైంగికంగా వేధించాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డైరీలో ప్రస్తావించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటన పై స్పందించిన పోలీసులు నిందితుడిని శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Also Read :  ఛోక్సీ మా దేశంలోనే ఉన్నాడు: బెల్జియం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల పైన టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వటంతో పాటుగా చేపట్టా ల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. 

ఇది కూడా చదవండి: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల లో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీగా రానున్న భక్తులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: లంగ్స్‌ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి

విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?

 హెచ్ డి పీపీ - (18), దాస సాహిత్య ప్రాజెక్టు - (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఒంటిమిట్టలో జరిగే ఈ కల్యాణోత్సవం తిలకించటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment