ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోవడంతో గాయాలు అయిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన సింగపూర్ నుంచి హైదరాబాద్‌కి వచ్చారు. ఈ క్రమంతో తన కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా ఓ అప్డేట్ ఇచ్చారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
Following the unfortunate fire incident at my son Mark Shankar’s summer camp in Singapore, I have been overwhelmed by the outpouring of prayers, concern, and support from all-over the world.
— Pawan Kalyan (@PawanKalyan) April 13, 2025
I wholeheartedly thank leaders from various political parties, @JanaSenaParty leaders,…
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న..
సింగపూర్‌లో సమ్మర్ క్యాంప్‌లో జరిగిన ఘటనలో గాయపడిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సినిమా కుటుంబసభ్యులు, మిత్రులు అందరికి కూడా నా ధన్యవాదాలని తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను తీసుకుని ఇండియాకి వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు.