/rtv/media/media_files/2025/02/05/0y7hp9TgMPm6bQGgHTZp.jpg)
AP Deputy CM Pawan Kalyan falls seriously ill Photograph: (AP Deputy CM Pawan Kalyan falls seriously ill)
తన గురువు షిహాన్ హుస్సేనీ (60) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు. షిహాన్ హుస్సేనీ మరణవార్త తనను ఎంతో బాధించిందని తెలిపారు. తాను ఆయన వద్దే కరాటే బ్లాక్‌బెల్ట్‌లో శిక్షణ పొందానని పవన్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ పోస్ట్ పెట్టారు.
Also Read : CRIME NEWS: పట్టపగలే కానిస్టేబుల్‌పై దాడి.. బీర్ బాటిల్‌తో తలపై కొట్టడంతో!
బతిమిలాడితే అంగీకరించారు
షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో బాధ పడుతున్నారని తనకు నాలుగు రోజులు కిందట తెలిసిందన్నారు పవన్. మార్చి 29న ఆయన్ని పరామర్శించడానికి చెన్నై వెళ్లాలనుకున్నానని.. కానీ ఇంతలోపే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు పవన్. ముందుకు తనకు కరాటే నేర్పేందుకు అంగీకరించలేదన్నారు పవన్. తాను ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు.. కుదరదని చెప్పారని..ఎంతో బతిమిలాడితే అంగీకరించారని పవన్ చెప్పుకొచ్చారు. తెల్లవారుజామున వెళ్లి సాయంత్రం వరకూ అక్కడే ఉండేవాడి శిక్షణ తీసుకున్నానని.. అది తనకు తమ్ముడు సినిమాలో సన్నివేశాలకు ఉపయోగపడిందన్నారు పవన్.
Also Read : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు!
కాగా షిహాన్ హుస్సేని పేరు మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలోపై మార్షల్ ఆర్ట్స్‌లో రాణించారు. మార్షల్ ఆర్ట్స్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. కరాటే, తాయ్‌క్వాండో, కిక్ బాక్సింగ్ వంటి పోరాట కళల్లో ప్రావీణ్యం సాధించి, ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు, అనేక హిట్స్ సినిమాల్లో నటుడిగానూ అలరించారు.
Also Read : Chaava Movie: పార్లమెంట్‌లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్‌లో వీక్షించనున్న మోదీ
Also Read : సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
pawan-kalyan | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news